‘మగధీరుడి’ని పొగడ్తలతో ముంచెత్తుతున్న జెన్నీ...
ప్రస్తుతం 'ఆరంజ్" లో రామ్ చరణ్ సరసన నటిస్తోన్న జెనీలియాకి చెర్రీ తెగ నచ్చాడంటూ ఫోజులిస్తోంది. ఇప్పుడెవరు వెళ్ళి జెనీలియాని 'ఆరంజ్" గురించి కదుపుతున్నా చరణ్ పురాణం విప్పేస్తోందట జెన్నీ. చరణ్ ని 'మగధీర" గెటప్ లో చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ తర్వాత 'ఆరంజ్" సెట్స్ లో చరణ్ డిఫరెంట్ లుక్ చూసి మళ్ళీ ఇంప్రెస్ అయ్యాను. రియల్లీ హీ ఈజ్ ఎ హ్యాండ్సమ్ గై. గ్రేట్ డ్యాన్సర్. చాలా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తాడు. మరియు తన ఫెర్ ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ తన వాయిస్" అంటూ ఇలాంటి మరెన్నో పొగడ్తలతో గ్యాప్ లేకుండా చెర్రీ స్తోత్రం వల్లిస్తోన్న జెనీలియా 'బొమ్మరిల్లు" టైమ్ లో చెప్పినట్టుగా ఈ సారి మాత్రం 'ఆరంజ్" సినిమా గురించి, డైరెక్టర్ భాస్కర్ గురించీ పెద్దగా ఏం చెప్పట్లేదు. మరింతకీ అదే పనిగా చరణ్ కి అందిస్తోన్న ఈ ప్రశంసల వెనుక మిస్టరీ ఏంటో..కెమిస్ట్రీ ఏంటో...


Click it and Unblock the Notifications











