ఎట్టకేలకు పెళ్లి విషయాన్ని ఒప్పుకున్న జెన్నీ
బబ్లీగర్ల్ జెనీలియా, బాలీవుడ్ నటుడు, కేంద్రమంత్రి కుమారుడు రితేష్ దేశ్ ముఖ్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీళ్ల ఇద్దరి మధ్య గత 8 ఏళ్లుగా ప్రేమాయణం సాగుతూనే ఉంది. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా ఇద్దరు ఎనాడూ మీడియాకు వెల్లడించలేదు. ఇటీవలే రితేష్ దేశ్ ముఖ్ మీడియా ముందుకు వచ్చి తమ పెళ్లి విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. తాను జన్నీని టూమచ్ ప్రేమిస్తున్నానని, ఆమెలేని జీవితం ఊహించుకోవడం నా వల్ల కాదు, 2012లో తమ పెళ్లి ఉంటుందని చెప్పారు.
రితేష్ ప్రకటన అనంతరం మీడియా వాళ్లంతా జెనీలియా వద్దకు వెళ్లగా.... నా పెళ్లి గురించి మీకెందు అంత తొందర? సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా అంటూ...ఓవరాక్షన్ చేసింది జెనీలియా. దీంతో వీళ్ల పెళ్లి వార్తలు నిజమా? కాదా? కొంపతీసి రితేష్ ది వన్ సైడ్ లవ్వా? అనే సవాలక్ష సందేహాలు వెలువడ్డాయి.
అయితే ఎట్టకేలకు పెళ్లి విషయాన్ని ఒప్పుకుంది ఈ తార. తన ట్విట్టర్ లో ఈవిషయాన్ని ఖరారు చేస్తూ ట్వీటింది. రితేష్, నేను త్వరలో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నారు. ఈ విషయం పట్ట ఇద్దరు ఎంతో ఆనందం ఉన్నాం అంటూ పేర్కొంది.


Click it and Unblock the Notifications











