విలేఖర్లపై విరుచుకుపడ్డ జెనీలియా
ఎప్పుడూ సౌమ్యంగా నవ్వుతూ సమాధానమిచ్చే జెనీలియా ఒక్కసారిగా మీడియాపై మండిపడేసరికి ముంబై మీడియా షాక్ అయ్యింది. హర్మాన్ బవేజా సరసన ఆమె నటించిన 'ఇట్స్ మై లైఫ్' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీని దర్శక, నిర్మాతలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మీడియా ముందుకెళ్లిన జెనీలియాని ఎప్పటిలాగే మీడియా విలేకరులు సినిమాకు సంభంధించి తప్ప అన్ని ప్రశ్నలూ అడగసాగారు. ముఖ్యంగా రితీష్ తో మీ పెళ్లి ఎప్పుడూ..మీ పెద్దలు ఒప్పుకున్నారా..గొడవపడ్డారని వినపడింది.. ఏమైంది.. వంటి ప్రశ్నలతో హోరిత్తెంచారు. దాంతో సినిమా గురించి చెప్పుదామనుకున్న ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఒక్కసారిగా ఆమె కోపంతో మండిపడింది.
వారు అడిగిన ప్రశ్నలు ఆమెకు చిర్రెత్తించాయి. దాంతో జెన్నీ..మేం కూడా మనుషులమే. మాకూ జీవితం ఉంటుంది. దాన్ని మరచిపోతున్నారు మీరు. మేం ఎంత సంపాదిస్తున్నాం, ఎవరితో ప్రేమలో పడ్డాం, ఎవరితో గొడవపడ్డాం... ఇవే మీకు ముఖ్యం. వీటిపైన మీ దృష్టి అంతా అంది. అంతేగాక..దేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. బాధ్యత గల మీడియా వాటిపై దృష్టి పెట్టకుండా, ఇలాంటివాటిపై కాన్సన్‌ట్రేషన్ పెట్టి, ప్రజలను పక్కదారి పట్టించడం ఎంత వరకు సబబు చెప్పండి? ఉన్నవి లేనట్టు. లేనివి ఉన్నట్టు రాసి మమ్మల్ని చీల్చి చెండాటమే మీ ఉద్యోగమా అంది. ఇక ప్రస్తుతం జెనీలియా తెలుగులో రాణా సరసన నాఇష్టం చిత్రం చేస్తోంది. అందులో ఆమె కృష్ణవేణిగా కనిపించి మురిపించనుంది. పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఆ చిత్రం ద్వారా తోలేటి ప్రకాష్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











