మీడియాపై మండిపడ్డ జెనీలియా
ఎప్పుడూ నవ్వుతూ మీడియాను రిసీవ్ చేసుకునే జెనీలియా మీడియాపై మండిపడుతూ మాట్లాడింది. ఆమె బోయ్ ప్రెండ్ రితీష్ ని జూలై లో వివాహం చేసుకోబోతోందంటూ ముంబయి మీడియాలో వచ్చిన వార్తని ఖండిస్తూ ఈ ప్రకటన చేసింది. ఆమె మాటల్లోనే.."నా వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటం నాకిష్టం ఉండదు. అయితే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అది కూడా నా కుటుంబ ప్రతిష్టకి భంగం వాటిల్లుతుంది కాబట్టి మాట్లాడుతున్నాను..మా జీవితాలకి సంబంధించిన నిర్ణయాన్ని ఎవరో తీసేసుకుని, మా పెళ్లి ఖరారు చేసేయడం హాస్యాస్పదంగా ఉంది. అసలిలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో అర్థం కావడంలేదు.' అంటూ నిప్పులు కురిపించిది జెనీలియా.
అలాగే మీడియా చేసే అసత్య ప్రచారాలవల్ల ఎదుటి వ్యక్తికి ఎంత నష్టం కలుగుతుందో ఆలోచించాలి. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు కనీసం అందులో ఎంత నిజముందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది' అంటూ దుమ్మెత్తింది. ఇక తాను సినిమాలవైపే తన దృష్టి అని, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే అదనంగా ఆలోచిస్తున్నానని కూడా ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకుంటే బహిరంగంగా ఆ విషయాన్ని ప్రకటిస్తానని కూడా జెనీలియా అంటున్నారు. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన జెనీలియా నటించిన 'చాన్స్ పే డాన్స్' చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. రామ్ చరణ్ తేజ సరసన చేస్తున్న ఆరెంజ్ చిత్రం షూటింగ్ ప్రారంబమయింది.


Click it and Unblock the Notifications











