twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను ఎవరిపై చెయ్యచేసుకోలేదు...జెనీలియా ఖండన

    By Srikanya
    |

    జెనీలియా రీసెంట్ గా ఓ అభిమానిపై చెయ్యి చేసుకుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆమె తరుపున ఆమె పర్శనల్ మేనేజర్ దివ్య ఖండించారు. సోమవారం విజయవాడలో ఓ షాపింగ్ మాల్ ఇనాగరేషన్ నిమిత్తం జెనీలియా వెళ్ళింది. ఆమె రాకతో అభిమానులు తొక్కడి మొదలైంది. కొందరైతే ఆమెను చూడటానికి ముందుకు వచ్చారు. అందులో ఓ వీరాభిమాని ఆమెని టచ్ చేయబోయారు. దాంతో ఆమె సహజంగానే చెంపదెబ్బతో స్పందించింది. పోలీస్ ప్రొటక్షన్ ఉన్నా కంట్రోల్ లేకపోయింది. ఇక దివ్య ఖండనలో..ఒక్కోసారి అటువంటి సంఘటనలు చోటు చేసుకోవటం స్టార్స్ కి కామన్. ఆమెను చూడగానే విజయవాడలోని ఆమె అభిమానులులో ఉత్సాహం ఉరకలెత్తింది. దాని ఫలితమే ఇది.

    అయినా అభిమానలు అక్కడ ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వచ్చారు. అందులో ఒకడు ఆమెను ముట్టుకోవాలని చూసాడు. లాంచింగ్ అయిన తర్వాత కూడా అత్యోత్సాహంతో ఆమెకు దగ్గరగా వచ్చాడు.అయితే జెనీలియా తనును తాను ఆ సిట్యువేషన్ నుంచి రక్షించుకోదలిచింది. అంతేగాని ఆ వ్యక్తిని ఆమె కొట్టలేదు. మీడియా దాన్ని ఎక్కువ చేసి చూపించింది. జెనీలియాకు తన అభిమానలుతో ఎలా మెలగాలో తెలుసు. ఆమె చాలా కాలంగా పరిశ్రమలో గౌరవంగా ఉంది. అలాగే ఆమెకు తెలుసు అభిమానలు..స్టార్స్ ని చూసినప్పుడు ఎలా స్పందిస్తారో. కాబట్టి దీన్నో ఇష్యూగా చేయటం అనవరసరం అని తేల్చింది. ఇక జెనీలియా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రం చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X