హీరో పై జెనీలియా బెట్
సెట్స్ పై ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ, అరుస్తూండే జెనీలియాకి ఛాటర్ భాక్స్ అని నిక్ నేమ్. అయితే ఇప్పుడామె ఛాలెంజ్ లు చేస్తూ మరింత రభస చేస్తోంది. ఇప్పుడు అదే ఆమె కొంపముంచుతోందని యాహూ చిత్ర యూనిట్ సభ్యులు. ఆ చిత్రంలో ఆమె షాహిద్ కపూర్ ప్రక్కన చేస్తోంది. మొదటి ఈ పాత్రకు జియాఖాన్ ని తీసుకున్నారు. అయితే ఆమె ఫెరఫార్మెన్స్ దర్శకుడు కెన్ ఘోష్ కి నచ్చక జెనీలియాను తీసుకొచ్చి ఆమె ప్లేసులో పడేసాడు. అయితే ఈ అతివాగుడు పిల్ల అంటే షాహిద్ కు ఇష్టం చూపటం లేదు.
ఎప్పుడూ రిజర్వుడుగా ఉండే షాహిద్ ఆమెను సెట్స్ మీద పలకరించటం లేదు. దాంతో వీరి స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత వరకూ పండుతుందనే డౌట్ దర్శకుడుకి మళ్ళి వచ్చింది. అయితే మళ్ళీ మార్చమంటే బాగుండదని ఊరుకున్నాడు. కానీ ఈ లోగా షాహిద్...తన ప్రక్కన ప్రియాంక చోప్రా అయితే బాగుంటుందని సూచించాడు. దాంతో ఎంతో కష్టపడి వేరే చోట డేట్స్ ఎడ్జెస్ట్ చేయించి తెచ్చిన జెనీలియాకి ఏం చెప్పాలో అని సతమతమవుతున్నాడు. కానీ జెనీలియా మాత్రం ఇదేమీ పట్టించుకోవటం లేదు. జబ్ వుయ్ మెట్ సినిమాలోలాగ షాహిద్ తన లాగా వాగే రోజు వస్తుందని బెట్స్ కాస్తోంది. అయితే అప్పుడు కరీనా లాగ సైలెంట్ అయిపోవాలమో అని మిగతావాళ్ళు జోకుతున్నారు.


Click it and Unblock the Notifications











