నేనంత దిగజారిపోలేదు: జెనీలియా ఫైరింగ్
సహజీవనం చేసేంత దిగజారిపోలేదు నేను. నాపై గిట్టని వాళ్లు పుట్టించిన రూమర్. దీన్ని పదే పదే ప్రసారం చేసి నా ఇమేజ్‌ని డామేజ్ చేస్తే ఊరుకోను అంటూ ముంబై మీడియాపై ఓ రేంజ్‌లో పైర్ అయిపోయింది జెనీలియా. ఈ మాట విన్న వారు వెంటనే సహజీవనం చేస్తున్నవారందరూ దిగజారిపోయిన వాళ్లనా మీ ఉద్దేశం? అని అడగ్గా ఖంగు తిన్న ఆమె ..మళ్లీ మరో రొచ్చులోకి నన్ను లాగడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది మీకు భావ్యం కాదు. నేను నాపై వచ్చిన వార్త గురించి మాట్లాడుతుంటే... టాపిక్‌ని పక్కదారి పట్టిస్తారేంటి? నేను నా గురించి మాట్లాడుతున్నాను. వేరొకరి గురించి కాదు. ఇక్కడ ఎవరి అభిప్రాయం వారిది. నా వరకు అది తప్పు. అదే నేను చెప్పాను. దయచేసి నన్ను ఇలాంటి వాటిల్లోకి లాగొద్దు అంటూ సీరియస్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది జెనీలియా. ఇక జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారనీ, ముంబయ్‌లోని ఓ ఖరీదైన ఏరియాలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ లో వీరు కాపురం పెట్టారని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఈ రాద్దాంతం జరిగింది.


Click it and Unblock the Notifications











