జెనీలియా పర్సనల్ అడ్రస్ లీక్, ఇమెయిల్స్ వరద
నయనతార ఓ విధమైన కష్టాలను ఎదుర్కుంటుంటే అందాల తార జెనీలియా మరో రకమైన కష్టాలను ఎదుర్కుంటోంది. ఆమె పర్సనల్ ఇమెయిల్ అడ్రస్సును ఎవరో లీక్ చేశారట. దాంతో ఆ ఇమెయిల్ అడ్రస్సుకు అభిమానులు తెగ మెయిల్స్ వచ్చి పడుతున్నాయట. దీంతో ఆమెకు పర్సనల్ మెయిల్స్ ను వేరు చేసుకోవడం తలనొప్పిగా మారింది. ఆమెకు రెండు ఇమెయిల్ అడ్రస్సులున్నాయి. ఒకటి పర్సనల్ వాడకం కోసం, మరోటి ఫ్యాన్ల కోసం వాడుతుంది. ఫ్యాన్స్ కోసం వాడే ఇమెయిల్ అడ్రస్సుకు వేలాది మెయిల్స్ వస్తుంటాయి. ఈ మెయిల్స్ ను పదిహేను రోజులకోసారి చూస్తుంది. ఏదో ఒకటి ఎంపిక చేసుకుని చూసి జవాబిస్తుంది. అయితే, గత కొద్ది రోజుల కిందటి నుంచి పర్సనల్ మెయిల్ అడ్రస్సుకు వేలాది మెయిల్స్ వస్తున్నాయి. ఆ మెయిల్ అడ్రస్సును ఎవరు లీక్ చేశారనేది జెనీలియాకు అంతు పట్టడం లేదని అంటున్నారు. ఇక, ఆమె పర్సనల్ మెయిల్స్ కోసం మరో అడ్రసును క్రియేట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.


Click it and Unblock the Notifications











