హాట్ స్టార్ జెనీలియా గంట రేటు అంతా?
రీసెంట్ గా జెనీలియా ఓ వాచి కంపెనీ యాడ్ కోసం గంటకి పది లక్షలు చొప్పున నలభై లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియాలో ఆరెంజ్ షూటింగ్ లో ఉండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమెను తమ యాడ్ కోసం డేట్స్ అడిగితే మరో నాలుగు నెలలు దాకా ఖాళీ లేదని చెప్పింది. దాంతో వారు తమ డైరక్టర్ తో అక్కడ లాంచ్ అయి కేవలం రెండు గంటలు కేటాయిస్తే చాలని రిక్వెస్ట్ చేసారు. దాంతో డైరక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర ఫర్మిషన్ తీసుకుని ఓకే చేయించుకుంది. మొదటి రోజు షూటింగ్ అయ్యాక మర్నాడు కూడా ఫినిషింగ్ టచ్ అంటూ మరో రెండు గంటలు అడిగారు. జెనీలియా సరేనని ఫినిష్ చేసింది. దాంతో వాళ్ళు ఖుషీ అయ్యి ఆమెకు ముందనుకున్నట్లుగా నలభై లక్షలు ఇచ్చి వెళ్ళారు. ఆ సాయింత్రం జెనీలియా..హీరో రామ్ చరణ్ కీ, దర్శకుడుకీ పార్టీ ఇచ్చిందని తెలిసింది. దాంతో ఆమెను ఇప్పుడు కన్సల్ట్ చేయాలంటే ఈ విషయం చెప్పి ఇండైరక్ట్ గా గంటకు పదిలక్షలు వసూలు చేసే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications











