రామ్ చరణ్ లో నాకు నచ్చింది అదే: జెనీలియా
చరణ్ లో నాకు నచ్చిన అంశాల్లో అతని వాయిస్ ముఖ్యమైనదని, తనతో కలిసి నటించడం ఎంతో ఆనందంగా వుందని జెనీలియా చెప్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న మరో చిత్రం 'ఆరెంజ్'. 'మగధీర' లాంటి సంచలన విజయం తర్వాత రామ్‌చరణ్ తేజ్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి, రామ్ చరణ్ గురించి జెనీలియా చెప్పుకొస్తూ- "'బొమ్మరిల్లు' చిత్రంలో నా పాత్రను చూసి అందరూ ఎంతగా సంతోషపడ్డారో, అంతకు మించిన విధంగా ఈ చిత్రంలో నా పాత్ర వుంటుంది. అభినయానికి ఆస్కారమున్న పాత్ర ఇది. చరణ్‌ను 'మగధీర' గెటప్‌లో చూసి ఇంప్రెస్ అయిన నేను 'ఆరెంజ్' సెట్స్‌లో డిఫరెంట్ లుక్ చూసి మళ్ళీ ఇంప్రెస్ అయ్యాను. రియల్లీ హీఈజ్ ఎ హ్యాండ్‌సమ్ గై. డ్యాన్సులు, ఫైట్స్ చాలా ఈజ్‌తో చేస్తాడు. నటనలో సహజతత్వం కనిపిస్తుంది. అందరితోనూ చాలా డిగ్నిఫైడ్‌గా బిహేవ్ చేస్తాడు అంటూ పొగడ్తల్లో ముంచేస్తోంది.


Click it and Unblock the Notifications











