పిచ్చ పిచ్చగా ఎక్స్ పోజింగ్ చేసేసిన జెనీలియా...!
ఇప్పటి వరకు ముద్దు ముద్దు మాటలతో, చిలిపి చిలిపి చేష్టలతో వెండితెరపై ఆకట్టుకున్న జెనీలియా అందుకు భిన్నంగా 'ఉరుమి"లో యుద్ద సైనికురాలిగా గుఱ్ఱపుస్వారి చేయడం సీన్స్ భాగా ఆకట్టుకోనున్నాయని సమాచారం. తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో కొత్త జెనీలియాని చూడబోతున్నామని ఆ చిత్రంలో కొన్ని స్టిల్ చూస్తే తెలిసిపోతోంది. ఈ చిత్రం కోసం జెనీలియా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. ఖచ్చితంగా అమ్మడికి అవార్డులు ఖాయం అని కేరళీయులు అంటున్నారు. దాంతో పాటు ప్రేక్షకుల రివార్డులు కూడా ఖాయమే.
అంతే కాదు ఎక్స్ ఫోజింగ్ కూడా అదరగొట్టిందని సమాచారం. అందాల ప్రదర్శన చేయాలనే కోరిక జెనీలియాకి ఉన్నా ఆమె అందాలు చూడాలని నిజంగా కోరుకునేవారు ఎందరుంటారు?తింగరి వేషాలకి తప్ప శృంగార నాయకిగా ఏమాత్రం సూట్ కాని జెనీలియా ఎన్నడూ లేనంతగా అందాల ప్రదర్శన చేస్తోంది. అంతే కాక యాక్షన్ హీరోయిన్ గాను మెప్పించేందుకు కృషి చేస్తోంది. కత్తి పట్టి, పైట తీసి జెనీలియా కదం తొక్కుతుంటే ఉరుమి సినిమా ఉరుములు కురిపిస్తుందని, కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ఆ చిత్ర రూపకర్తలు భావిస్తున్నారు. నిజంగా జెనీలియాకి అంతుందా ? వేచి చూడాల్పిందే?


Click it and Unblock the Notifications











