జెనీలియాతో బాగా ఎంజాయ్ చేసా

By Srikanya

జెనీలియా తో తొలి చిత్రం చేయటాన్ని ఎవరు సంతోషంగా ఫీలవరు చెప్పండి అంటున్నాడు కథ చిత్రంతో పరిచయమైన అరుణ్. గుణ్ణం గంగరాజు నిర్మించి కథ చిత్రం రెండు వారాల క్రితం రిలీజై బిలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో పరిచయమైన అరుణ్ అవకాశాలకోసం టాలీవుడ్ వంక ఆశగా ఎదురుచూస్తున్నాడు. అతనికి ఈ తెలంగాణ,సమైఖ్యాంద్ర నినాదాలు తెలిసినట్లు లేవు. ఎంతో పాజిటివ్ గా త్వరలోనే ఓ మంచి ఆపర్టునిటీ వస్తుందని నమ్మకం ఉందంటున్నాడు ఈ ఇరవై ఏళ్ళ కుర్రాడు. మీడియాతో మాట్లాడుతూ..నేను జర్నలిజం డిగ్రీ పూర్తి చేయగానే..ధియోటర్ వైపు ఎట్రాక్ట్ అయ్యాను. అలాగే ఫొటోగ్రఫీని వృత్తిగా భావించి చేయసాగాను. ఈ సమయంలోనే హ్యాపీడేస్ తమిళ వెర్షన్ రీమేక్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. వెళ్లా సెలక్టయ్యా.

ఈ లోగా కథ చిత్రంలో సోలో హీరోగా ఆఫర్ వచ్చింది. వెనక్కి తిరిగి ఆలోచించకుండా చేసా..ఈ చిత్రమే మొదట రిలీజైంది. నాకు నిజం చెప్పాలంటే నైన్ టు ఫైవ్ తరహా జాబ్స్ ఇష్టం ఉండవు. అదే నన్ను ఈ ఫీల్డ్ కు లాక్కొచ్చింది. ఇక కథ లోకి చూస్తే జెనీలియా హీరోయిన్. ఇది నాకు గ్రేట్ ఆపర్టునిటీ. జెనీలియా స్వీర్ట్ హార్ట్. ఇద్దరూ సెట్స్ పై బాగా ఎంజాయ్ చేసాం. ఆమె చాలా ఎనర్జీతో సరదాగా ఉండేది. ఇక నాకు సినిమా ఫీల్డులో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదన్న మాట నిజమే. అంతమాత్రాన నాకొచ్చే ఆఫర్స్ తగ్గిపోతాయానుకోను..ఈ రోజుల్లో ఆఫర్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. కానీ నిలబెట్టుకోవటం కష్టం. కానీ ఇప్పటికీ నన్ను మా కుటుంబమే సపోర్టు ఇస్తోంది. ఇక ఈ యాక్టింగ్ కెరీర్ వర్కవుట్ కాదంటారా..నేను రాసుకుంటూ రైటర్ ని అవుతాను. మీకు తెలుసా నాకు పర్శనల్ బ్లాగ్ ఉంది. అయితే పబ్లిక్ లైఫ్ లోకి వచ్చాక..నేను రాయటం మానేసా..అంటూ తన మనస్సులో మాటలు చెప్పాడు అరుణ్. బెస్ట్ ఆఫ్ లక్ అరుణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X