జెనీలియా గర్భవతి అంటూ వార్తలు, ఇదీ పిఆర్ వివరణ

By Bojja Kumar

ముంబై: హీరోయిన్ జెనీలియా గత సంవత్సరం బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెనీలియా గర్భం దాల్చిందని, ఆమె తనకు పుట్టబోయే ఫస్ట్ బేబీపై ఎంతో ఎగ్జైట్‌మెంట్‌గా ఉందని బాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వెలువడటం మొదలయింది.

ఈ నేపథ్యంలో ఆమె పబ్లిక్ రిలేషన్ మేనేజర్ వివరణ ఇచ్చారు. జెనీలియా గర్భందాల్చిందనే వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. ఆయన మాట్లాడుతూ... 'జెనీలియా ఇంకా గర్భం దాల్చ లేదు. అలాంటి విశేషం ఏమైనా ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. ఇప్పుడప్పుడే రితేష్, జెనీలియా పిల్లలను కనే ఆలోచనలో లేరు' అని వెల్లడించారు.

'ప్రస్తుతం జెనీలియా, రితేష్ వివిధ కార్యకలాపాల్లో కలిసి పని చేస్తున్నారు. ఇటీవల సిసిఎల్ ఫ్రాంచైజీ కొనుగోలు దగ్గర నుంచి వారి ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థ పనుల వరకు అన్నింటినీ కలిసి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు అనేక సినిమా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో జెనీలియా మళ్లీ తెరపై కనిపించబోతోంది' అని తెలిపారు.

జెనీలియా, రితేష్ గత సంవత్సరం ఫిబ్రవరి 3న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మిగతా వివరాలు స్లైడ్ షోలో...

జెనీలియా గర్భవతి అంటూ వార్తలు, ఇదీ పిఆర్ వివరణ

జెనీలియా మళ్లీ సినిమాల్లోకి ఎప్పుడు వస్తుంది? అంటూ ప్రశ్నిస్తున్నారు ఆమె అభిమానులు. ముఖ్యంగా సౌత్ సినిమా అభిమానులు. గతంలో జెనీలియా పలు సౌత్ సినిమాలతో ఇక్కడి వారిని అలరించిన సంగతి తెలిసిందే.

జెనీలియా గర్భవతి అంటూ వార్తలు, ఇదీ పిఆర్ వివరణ

ఈ విషయమై ఆ మధ్య జెనీలియా మాట్లాడుతూ..‘ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఏమీ చేయడం లేదు. కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను చాలా యంగ్ ఏజ్ లోనే కెరీర్ ప్రారంభించాను. 10 సంవత్సరాలు సంవత్సరానికి 365 రోజులు ఎలాంటి బ్రేక్ లేకుండా శ్రమించాను' అని వెల్లడించారు.

జెనీలియా గర్భవతి అంటూ వార్తలు, ఇదీ పిఆర్ వివరణ

‘ఐద ఫిల్మ్ ఇండస్ట్రీలలో నేను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను' అని తెలిపారు.

జెనీలియా గర్భవతి అంటూ వార్తలు, ఇదీ పిఆర్ వివరణ

రితేష్ దేశ్ ముఖ్ ఇటీవల సిసిఎల్ టీం కొనుగోలు చేయడంతో పాటు, ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను కూడా నడిపిస్తున్నాడు.

జెనీలియా గర్భవతి అంటూ వార్తలు, ఇదీ పిఆర్ వివరణ

జెనీలియా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆమె సౌత్ సినిమాల్లో నటించే అవాకశం లేదని ఆమె సన్నిహితులు అంటున్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X