Don't Miss!
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్‌ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
జెనీలియా ధ్రిల్లర్ 'కథ' రిలీజ్ డేట్
జెనీలియా ప్రధానపాత్రలో జస్ట్ ఎల్లో బ్యానర్ పై గుణ్ణం గంగరాజు నిర్మించిన కథ చిత్రం నవంబర్ 18న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్స్ అంతటా పాజిటివ్ రెస్పాండ్ తో పాపులర్ అయ్యాయి. ఐతే, అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది వంటి విభిన్న తరహా చిత్రాలు నిర్మించిన జస్ట్ యల్లో బ్యానర్ వారు నిర్మిస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అరుణ్, జెనీలియా కాంబినేషన్లో రెడీ అయిన ఈ ద్రిల్లర్ లో జెనీలియా ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుంది. శ్రీనివాస్ రాగ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఎస్.కె.బాలచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
మాటల రచయిత, నిర్మాత అయిన గుణ్ణం గంగరాజు ఈ చిత్రం గురించి...అమ్మ చెప్పింది చిత్రం రిలీజైన మూడేళ్ళ తర్వాత ఈ సినిమా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ప్లాన్ చెస్తున్నాం..ఈ చిత్రం బేసిక్ గా థ్రిల్లర్ అయినా ప్రేమ కంటెంట్ అండర్ కరెంట్ గా ఉంటుంది అంటున్నారు. శ్రీనివాస్ గతంలో కోడిరామకృష్ణ వద్ద నవ్వుతూ బ్రతకాలరా, త్రినేత్రుడు, జెండా చిత్రాలకు పనిచేసారు.
ఇక ఈ చిత్రంలో జెనీలియా సరసన తమిళ కుర్రాడు అరుణ్ నటిస్తున్నాడు. అతను తమిళ హ్యాపీడేస్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అతనిది రచయిత పాత్ర..నేను రాసే కథే ఈ చిత్రం అంటున్నారు. సంగీత దర్శకుడు బాలచంద్రన్ గుణ్ణం గంగరాజు గారి సీరియల్స్ కి పనిచేసారు. బ్రహ్మాస్త్రం సినిమాకి సంగీతం అందించారు. ఇక ఈ చిత్రం హిల్ స్టేషన్ నేపధ్యంలో జరుగుతుంది. అందుకే అరుకులో ఎక్కువ భాగం షూట్ చేసారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రఘుబాబు, షఫి వంటి సీనియర్స్ కీలక పాత్రల్లో నటించనున్నారు.