'ఆరెంజ్' ఫ్లాప్ నుంచి జెనీలియా చాలా నేర్చుకుంది
ఆరెంజ్ చిత్రం ఫెయిల్యూర్ అయిన దగ్గరనుంచి జెనీలియాలో మంచి పరిణితి వచ్చినట్లుంది.ఎప్పుడు ఎవరు కదిపినా వేదాంతం చెపుతోంది. తాజాగా ఆమె మళయాళంలో చేసిన 'ఉరుమి'చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.దాంతో ఆమె మరింతగా రెచ్చిపోయి మాట్లాడుతోంది.రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...పొగడ్తలకు పొంగి పోవడం గానీ... అపజయాలకు కుంగిపోవడం నా తత్వం కాదు. సినిమాల్లోకి వచ్చిన తరువాత చాలా నేర్చుకున్నా.
ఇక్కడ పొగడ్తలు ఉంటాయి... విమర్శలు ఉంటాయి.రెండిటినీ సమానంగా స్వీకరించే గుణం ఉండాలి. అప్పుడే మన స్పోర్టివ్‌నెస్ ఏంటో ఎదుటివారికి తెలుస్తుంది.ఎట్టిపరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోను. నా వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవడమే అంది జెనీలియా.అలాగే సినిమాల్లో ఎన్ని పాత్రల్లో నటించినా... ఎంతటి పేరు తెచ్చుకున్నా ఒదిగి ఉండటమే ఇప్పటి దాకా నేను నేర్చుకున్నానంటోంది.ప్రస్తుతం ఆమెను రానా సరసన నా ఇష్టం చిత్రంలో బుక్ చేసారు.


Click it and Unblock the Notifications











