జెనీలియా పరిణతి చెందిందోచ్
జెనీలియా డిసౌజా. 'బాయ్స్" చిత్రం ద్వారా దక్షిణాదిన అరంగ్రేటం చేసిన ఈ భామ ఇక్కడ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తన బబ్లీ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకుంది. బక్క పలుచగా ఉండే జెన్నీకి...ఆమె బాడీ లాంగ్వేజ్ కు తగిన విధంగా చాలా వరకు కాలేజీ గర్ల్ పాత్రలే వచ్చాయి. రాను రాను దక్షిణాది సినిమాల్లో మంచి స్థానానికి ఎదగడంతో పరిణతి చెందిన పాత్రలు... అంటే సినిమాలో కేవలం ఓ ఎంటర్ టైన్మెంట్ పంచే అందాల బొమ్మగా కాకుండా ముఖ్యమైన పాత్రలు ఆమెను వరించాయి.
అయితే ఇటీవల బాలీవుడ్ రంగ ప్రవేశ చేసిన జెనీలియా కెరీర్ మళ్లీ మొదటి కొచ్చిందనే చెప్పాలి. చాలా సినిమాల్లో ఆమెకు బబ్లీ కాలేజ్ గర్ల్ పాత్రలే వరించాయి. తనకు ఇక్కడ సరైన పాత్రలు దక్కడం లేదనే విషయాన్ని జెనీలియా కూడా పలు సందర్భాల్లో బయట పెట్టింది. 'బాలీవుడ్ లో నాకు అన్నీ కాలేజీ అమ్మాయి పాత్రలే వస్తున్నాయి. దక్షిణాది సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు వచ్చేవి, కానీ ఇక్కడ మాత్రం ఇప్పటి వరకు అలాంటి పాత్రలు రాలేదని" పలు సందర్భాల్లో వాపోయింది.
అయితే ఎట్టకేలకు జెనీలియా కోరిక తీరినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం జాన్ అబ్రహం సరసన 'ఫోర్స్" సినిమాలో నటిస్తుంది. అమ్మడు ఈ సినిమాలో అల్లరి చిల్లరి పిల్లగా కాకుండా, పరిణితి చెందిన అమ్మాయిగా కనిపించనుందట. చూద్దాం జెనీలియాలో ఏ మేరకు పరిణతి వచ్చిందో...


Click it and Unblock the Notifications











