twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రానా, జెనీలియాల 'నా ఇష్టం' హిందీలోనూ...

    By Srikanya
    |

    రానా,జెనీలియా కాంబినేషన్ లో రూపొందుతున్న 'నా ఇష్టం' చిత్రాన్ని హిందిలోనూ నిర్మించి ఒకే సారి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయమై జెనీలియా మాట్లాడుతూ..తెలుగులో రానాతో కలిసి 'నా ఇష్టం' చిత్రంలోనూ నటిస్తున్నా. హిందీ వెర్షన్‌లో కూడా దీనిని నిర్మిస్తున్నారు అంది.జెనీలియాకు,రానాకు ఇద్దరికీ హిందీలో మార్కెట్ ఉండటంతో ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె తాజా చిత్రం ఫోర్స్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే ..ప్రస్తుతం జాన్ అబ్రహంతో కలిసి 'ఫోర్స్'లో నటిస్తున్నా. ఇది ఈ నెలలోనే విడుదల కానుంది. అలాగే తమిళంలో విజయ్‌తో కలిసి 'వేలాయుధం' చిత్రంలో నటిస్తున్నా. ఇది వచ్చేనెలలో విడుదల కానుంది. ఈ చిత్రంతో పాటు నా చేతిలో ఆరు చిత్రాలు ప్రస్తుతం వున్నాయి. వీటితోనే ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉన్నా. మిగతా విషయాలు తరువాత ఆలోచిద్దాం'' అంది జెనీలియా. 'నా ఇష్టం" టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. అందాల హాసిని జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నా ఇష్టం'.

    జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఇటీవల రాణా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మించిన "నేను- నా రాక్షసి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదీకాక రాణా ఇంకా తనను తాను ఒక పక్కా కమర్షియల్ మాస్ హీరోగా నిరూపించుకోవలసి ఉంది. అది అనుకున్నంత సులువైన సంగతేం కాదు. అందుకు రాణా ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది. తాను నటించబోయే పాత్ర గురించి మరింత శ్రద్ధ తీసుకుని చాలా హోమ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.

    English summary
    Rana's Naa Istam film made in Hindi also.In this film Genilia as female lead dircted by Prakash Tholeti.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X