మాధవన్ తో జెనీలియా ఫోన్ రొమాన్స్
విద్యాభాలన్ తో ఎయిర్ టెల్ యాడ్ లో జతకట్టిన మాధవన్ తాజాగా జెనీలియాతో రొమాన్స్ చేయనున్నారు. ఈ మేరకు ఎయిర్ టెల్ సంస్ధ యూత్ లో పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని జెనీలియాను ఎంపికచేసిందని సమాచారం. మాధవన్ ని కూడా మార్చి షాహిద్ కపూర్ అనుకున్నా..సౌత్ మార్కెట్ కి పరిచయమైన రొమాంటిక్ హీరోగా మాధవన్ నే ఉంచాలని వారు భావిస్తున్నారు. త్వరలో మొదలయ్యే ఎయర్ టెల్ కాంపయిన్ లో జెనీలియా కనిపించనుంది. జెనీలియా ఈ యాడ్ రావటం తనకో కొత్త గుర్తింపు వచ్చినట్లుగా ఫీలవుతున్నానని చెప్పింది.జెనీలియా ప్రస్తుతం రామ్ చరణ్ తేజ సరసన ఆరెంజ్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మెలబోర్న్ లో జరుగుతోంది. హిందీ చిత్రాలలోనూ జెనీలియా బిజీగా ఉంది. ఇక మాధవన్ త్రీ ఇడియిట్స్ అనంతరం కొత్త ఇమేజ్ తెచ్చుకుని ఎంపిక చేసుకున్న చిత్రాలలోనే చేయాలనే నిర్ణయించుకున్నారు.


Click it and Unblock the Notifications











