న్యూ ఇయర్ కి జెనీలియా ప్లాన్ ఏమిటంటే...
జెనీలియా ఈ 2010 న్యూఇయిర్ ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఆమె నాసిక్ వెళ్తోంది. అక్కడ ఓ పాపులర్ చర్చి ఉందని దానిని సందర్శించి ఈ సంవత్సరం తనకు శుభాలు కలగాలని కోరుకుంటానని చెప్తోంది. అలాగే క్రితం సంవత్సరం కూడా చేసానని అందుకు తగ్గట్లుగానే భగవంతుడు తనకు బాలీవుడ్ లో సక్సెస్ లిచ్చాడని అంటోంది. అలాగే తను,తన కుటుంబం ప్రభువు మీద పూర్తి విశ్వాసం ఉందని, చర్చికి రెగ్యులర్ గా వెళ్లటం తమ జీవన విధానంలో ఒకటి అని పేర్కొంది. ఇక 2009 కెరీర్ పరంగా నాకు గొప్ప సంవత్సరం అందుకు దేముడుకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంటోంది. ఇక జెనీలియా ఈ 2009 సంవత్సరం తెలుగులో కథ చిత్రంలో చేసింది. గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ధ్రిల్లర్ భాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చెయ్యలేకపోయింది. అలాగే హిందీలోనూ లైఫ్ పార్టనర్ చిత్రంలో చేసింది. అదీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే రామ్ చరణ్ తేజ ప్రక్కన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో కమిటయ్యింది. అలాగే ఛాన్స్ పే డాన్స్, ఇట్స్ మై లైఫ్, హుక్ యా క్రూక్ చిత్రాలు రిలీజ్ కావల్సి ఉన్నాయి.


Click it and Unblock the Notifications











