twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెనీలియాను మోసం చేసినటువంటి ఆహ్యాండ్ సమ్ ఎవరబ్బా..

    By Nageswara Rao
    |

    చాలా మంది హీరోయిన్లుకు కోంత ఎత్తుకి ఎదిగిన తర్వాత పోగరు అనేది వాళ్శను ఆటోమాటిక్ గా ఆవహిస్తుంది. దీనిని నుంచి ఎవరూ తప్పించుకోలేరనేది ఓసత్యం. గతంలో కూడా చాలా మంది ఇలాంటి చాలా సంఘటనలను మనం చూడడం జరిగింది. కాని ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండాలనేది మన అంతాలతార జెనీలియాని చూసి నేర్చుకోవాలని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇటీవల జెనీలియా ఓ ప్రైవేటు టాక్సీలో షూటింగ్‌కి అటెండ్ అయ్యారు. ప్రైవేటు టాక్సీలో దిగిన జెనీలియాను చూసి షూటింగ్‌స్పాట్‌లో ఉన్నవారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక జెన్నీని తీసుకొచ్చిన టాక్సీ డ్రైవర్ పరిస్థితి అయితే.. వర్ణించనవసరంలేదు. అందాల జెనీలియా తన కారులో ఆశీనురాలైంది అంటే ఆ సగటు మనిషి హృదయం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవ్వకుండా ఉంటుందా...!

    అసలు జెన్నీకి ఇలా ప్రైవేటు టాక్సీలో రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనే విషయానికొస్తే... సమయాన్ని వృధా చేయడం అంటే జెన్నీకి ఇష్టం ఉండదు. ఒకరోజు షూటింగ్‌కి రెడీ అయ్యి.. ఇంటి లాన్‌లోకి వచ్చారామె. అక్కడ కారు లేదు, డ్రైవరూ లేడు. కాసేపు డ్రైవర్ కోసం వెయిట్ చేశారు జెన్నీ. ఎంతసేపటికీ అతను రాలేదు. అప్పుడర్థమైంది తనకు డ్రైవర్ హ్యాండిచ్చాడని. ఇక లేట్ చేయడం మంచిది కాదు అనుకున్నారు జెనీలియా. వెంటనే బయటికొచ్చి ఓ ప్రైవేటు టాక్సీని మాట్లాడుకొని షూటింగ్‌కి వచ్చేశారు. అదీ విషయం. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని అన్నారు. ఇలా చేయడం వల్ల జెనీలియా కోపంతో ఆడ్రైవర్ నిఏమి అనకుండా మంచి పని చేశావని మనసులోనే ఆనందపడిందంట.

    ఎందుకంటే... అతను హ్యాండివ్వడం వల్ల ఒకప్పటి మధురానుభూతులు మళ్లీ గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. టాక్సీలో వెళుతున్నప్పుడు చిన్నప్పటి సంగతులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ట్రైన్స్‌లోనూ, రిక్షాల్లోనూ స్కూలుకి వెళ్లిన రోజులు, అమ్మతో పాటు మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తెచ్చిన రోజులు... గుర్తొచ్చాయి. హీరోయిన్ అయిన తర్వాత పబ్లిక్ వెహికల్‌లో తిరగడం కుదర్లేదు. డ్రైవర్ హ్యాండివ్వడం వల్ల ఆ అవకాశం దొరికింది అంటూ తనదైన శైలిలో సంఘటనను గుర్తుచేసుకన్నారు. జెనీలియా, రామ్ చరణ్ తేజ్ నటించినటువంటి ఆరంజ్ ఇటీవలే విడుదలై మంచి వసూళ్లను రాబడుతున్న విషయం అందరికి తేలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X