జెనీలియా సంగీత్: రాణా హాజరు
హీరోయిన్ జనీలియా తన కోస్టార్ రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ముంబైలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 3న ముంబైలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది. సంగీత్ కార్య్రకమానికి బాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ నుంచి హీరో దగ్గుబాటి రాణా కూడా హాజరయ్యాడు. అదరిపోయే డ్రెస్‌తో ఆ వేడుకకు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు రాణా.
రాణా-జనీలియా జంటగా నటించిన నా ఇష్టం సినిమా త్వరలో విడుదల కానుంది. ఇప్పటి వరకు జెనీలియా సౌత్ సినిమాల్లో చేసిన చివరి సినిమా కూడా 'నా ఇష్టం' కావడం గమనార్హం. పెళ్లి తర్వాత జెనీలియా హీరోయిన్‌గా నటించినా....ఇప్పటికే దక్షిణాది సినిమాలు దాదాపుగా దూరంగా ఉంటున్న ఆమె పెళ్లి తర్వాత ఇటు వైపు చూసే అవకాశాలు లేవంటున్నారు ఇక్కడి సినీ వర్గాలు.
జెనీలియా ఈ సంవత్సరం హిందీలో ఇట్స్ మై లైఫ్, తెరే నాల్ లవ్ హోగయా, రాక్ ద షాది, బ్లడీ పాకి చిత్రాలకు కమిట్ అయింది. ఈ సినిమాల షూటింగులు ఇంకా పూర్తి కాలేదు. పెళ్లి పూర్తయిన తర్వాత కొన్ని రోజులు భర్తతో ఎంజయ్ చేసిన తర్వాత ఆయా సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











