'బెజవాడ రౌడీ’తో చరణ్ హీరోయిన్ రొమాన్స్...!?
'రామ్ చరణ్ తో బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన చిత్రం 'ఆరెంజ్". ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా జెనీలియా నటించి విషయం తెలిసిందే..ఈ సినిమా ఫ్లాప్ తో తెలుగులో కనుమరుగవుతుందనుకున్న జెనీలియా ప్రస్తుతం రానా హీరోగా రూపొందుతున్న'నా ఇష్టం"లో నటించే ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచింది..ఇక ఈ సినిమా తర్వాత మరో ఛాన్స్ జెనీలియాని వరించింది అదీ రామ్ గోపాల్ వర్మ రూపంలో..'రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా 'బెజవాడరౌడీలు" అనే చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే..
ఈ మద్యే విజయవాడలోని సిద్దార్థ కాలేజ్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ గా జెనీలియాని రామ్ గోపాల్ వర్మ సెలెక్ట్ చేసుకున్నాడని ఫిలింనగర్ సమాచారం..'ఆరెంజ్" రిలీజ్ తర్వాత నాగబాబు కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన చరిష్మాని కోల్పోయిన జెనీలియా మెల్లమెల్లగా తెలుగులో తనకున్న గుర్తింపుతో తిరిగి ఛాన్స్ లు కొట్టేస్తుండటం విశేషమే...


Click it and Unblock the Notifications











