ఆరెంజ్ హీరోయిన్ జెన్నీ కి మళ్లీ టాలీవుడ్ అవకాశం...!
టాప్ లెవల్ లో ఉన్న జెనీలీయా క్రేజ్ ని ఆరంజ్ సినిమా ప్లాప్ తో నాగబాబు పున్యమా అని పోగొట్టుకొని టాలీవుడ్ కు దూరమై, బాలీవుడ్ లో వీరవిహారం చేస్తోంది. తర్వాత తెలుగులో సినిమాలు లేక అల్లాడుతూ, హైదరాబాదు ఫిలిం నగర్ కి దూరమైపోయిన ముంబాయ్ భామ జెనీలియాకు తాజాగా ఓ సినిమా ఆఫర్ వచ్చింది. 'లీడర్' రాణా సరసన నటించే అవకాశం అది.
కాగా 'లీడర్" రాణా నటించిన రెండో చిత్రం 'నేను నా రాక్షసి" త్వరలో విడుదలకాబోతోంది. రాణా మూడో సినిమాకి రంగం సిద్దమవుతోందట. గతేడాది బాలకృష్ణ తో సూపర్ హిట్ సినిమా 'సింహా'ను నిర్మించిన పరుచూరి కిరీటి దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రకాష్ తోలేటి అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రకాష్ గతంలో సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పని చేశాడు. కాగా, రాక రాక అవకాశం రావడంతో జెన్నీ దీనిని వెంటనే యాక్సప్ట్ చేసేసిందట.


Click it and Unblock the Notifications











