Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జెనీలియా లేటెస్ట్ రిలీజ్ 'కథ' చిత్రం ఏమైంది?
గుణ్ణం గంగరాజు నిర్మాతగా జెనీలియా ప్రధాన పాత్రలో రూపొందిన కథ చిత్రం ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ రొమాంటిక్ ధ్రిల్లర్ ఊహించినంత గొప్పగా లేదని, సినిమా టీవీ సీరియల్ లాగ సాగుతూ బోర్ కు గురి చేసిందని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఎక్కడో క్లైమాక్స్ లో వచ్చే చిన్న ట్విస్టు కోసం కథను నడపటం నచ్చటం లేదంటున్నారు. ఈ చిత్రంలో జెనీలియా చైత్ర అనే స్కూల్ టీచర్ గా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులంతా కళ్ళదురుగా హత్యకు గురి అయితే మెంటల్ గా డిస్ట్రబ్ అయిన ఆమె కొంతకాలం మెంటల్ హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అనంతరం రిలాక్సేషన్ కోసం ఆమె అరుకు ప్రాంతానికి వస్తుంది. అక్కడ కృష్ణ(అరుణ్)అనే క్రియేటివ్ డైరక్టర్ పరిచయమవుతాడు. అతను తను తీయబోయే కథ రాసుకోవటం కోసం అక్కడికి వస్తాడు. వారిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది.
ఈ క్రమంలో ప్రకృతి దృశ్యాలు చూసేందకు కొండ దిగువకు వెళ్ళిన చైత్ర అక్కడో హత్య గావింపబడిన శవాన్ని చూస్తుంది. భయంతో వెంటనే వెళ్ళి పోలీసులను వెంటపెట్టుకు వచ్చేసరికి ఆ శవం మాయమవుతుంది. మరో ప్రక్క ఆమె గతంలో మానసికంగా దెబ్బ తిని ఉండటంతో అదంతా ఆమె భ్రమ కొట్టిపారేస్తారు. ఊరంతా పిచ్చిదని ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో చైత్ర ఎలా అసలు హంతకుడుని పట్టుకుంది.తన మానసిక పరిస్ధితి బాగానే ఉందని ఎలా నిరూపించుకుని, తన ప్రేమను గెలుచుకుంది అన్నదిశగా కథనం నడుస్తుంది. బొమ్మరిల్లు చిత్రంలో హాసినిగా అదరకొట్టిన జెనీలియా ఈ పాత్ర తడబడకుండా ఈజీగానే చేసేసింది. ప్రకాష్ రాజ్ కూడా అరుకు సీఐ గా బాగానే చేసాడు. ఉన్నంతలో రఘుబాబు కామిడీ బావుంది. అయితే ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉండటం, నేరేషన్ మరీ స్లోగా ఉండటం ఈ చిత్రాన్ని మల్టీప్లెక్స్ లకే పరిమితం చేసే అవకాశం ఉంది.