జెనీలియా కొడుకు ముద్దొస్తున్నాడు (ఫస్ట్ లుక్ ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ జెనీలియా ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో ద్వారా అభిమానులకు షేర్ చేసారు జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ దంపతులు. తమ ఫ్యామిలీలోకి మరో కొత్త వ్యక్తి రావడంతో అంతా సంతోషంగా ఉన్నారు.
మాతృత్వపు మధురానుభూతిని అనుభవిస్తున్న జెనీలియా హ్యాపీగా ఉండటాన్ని చూసి ఆమె ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జెనలియా బిడ్డ పుట్టడంతో ఇక శాశ్వతంగా సినిమాలకు దూరం అయినట్లే అని సినీవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
స్లైడ్ షోలో జెనీలియా కొడుకు ఫోటోస్...

జెనీలియా కొడుకు
జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ దంపతులకు జన్మించిన మగ బిడ్డ ఎంతో ముద్దొస్తున్నాడు. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది.

ప్రేమ వివాహం
రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా మధ్య పెళ్లికి ముందు నుండే చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్' నుండే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.

పెళ్లి
రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా డిజౌజా మధ్య దాదాపు పదేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు.

సినిమాలకు దూరం
సౌతిండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జెనీలియాకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమె సినిమాలకు దూరం కావడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











