twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్బో...జెనీలియా తెగచించుకుంటోంది!

    By Bojja Kumar
    |

    ఎంతగినా ఒదిగి ఉండాలి, లేకపోతే పాతాళానికి పడిపోక తప్పదు. పాపం ఈ విషయం బబ్లీ గర్ల్ జెనీలియా గ్రహించినట్లు లేదు. ఒకప్పుడు తెలుగు తెరపై వరుస అవకాశాలతో ఓ వెలుగు వెలిగింది జెనీలియా. దక్షిణాదిన వచ్చిన నెంబర్ స్థానంతో తలపొగరు బాగా ఒంటపట్టించుకున్న జెన్నీ బాలీవుడ్ అవకాశాల కోసం అర్రులు చాచింది. అక్కడ పెద్దగా అవకాశాలు లేకున్నా పరువు నిలబెట్టుకోవడానికి అరకొర రెమ్యూనరేషన్లతో సినిమాలు చేస్తూ, తెలుగులో చేయమంటే మాత్రం కోట్లు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. జెనిలియా దెబ్బకు దక్షిణాది నిర్మాతలు ఆమె వైపు చూడటమే మానేశారు. ప్రస్తుతం జెనిలియా చేతిలో తెలుగలో నాఇష్టం, తమిళంలో వేలాయుధం సినిమా తప్ప వేరే సినిమాలు లేవు. బాలీవుడ్ ఇటీవల రెండు మూడు సినిమాల్లో నటించినా పెద్దగా నిలదొక్కుకోక పోయింది. అందుకే మళ్లీ దక్షిణాది వైపు కన్నేసింది. అంతా బాగానే ఉంది కానీ, బాలీవుడ్ నటిస్తున్నాననే పొగరో? ఏమో తెలియదు గానీ దక్షిణాది సినిమాల్లో నటించేటప్పడు తెగ చించుకుంటోందని చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు.

    ప్రస్తుతం జెనిలియా విజయ్ సరసన వేలాయుధం అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా హన్సిక కూడా నటిస్తోంది. అయితే సెట్స్‌లో తనతో సమానంగా హన్సికు ప్రాధాన్యత ఇవ్వడాన్ని అస్సలు తట్టుకోలేక పోతున్న జెనిలియా ఏదో కారణంగా ఆమెతో గొడవకు దిగడం ప్రారంభించిందని సమాచారం. నా రేంజే వేరు......హన్సికతో నన్ను పోల్చడం ఏమిటని ఇటీవల సెట్ లోనే నానా రచ్చ చేసిందట. చివరకు సినిమా హీరో విజయ్ ఎంటరై వివాదం సమసి పోయేలా చేశాడట. అయితే జెనీలియాకు ఇంత పొగరు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ వర్గాలు.

    English summary
    Genelia has allegedly given tough time for Hansika on Velayudham sets that the hero of that film, Vijay had to interfere and settle the issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X