చివరకు సారీ చెప్పిన జెనీలియా
హైదరాబాద్‌లో లోని ఒక ఫ్యాషన్ వేదికపై జెనీలియా రీసెంట్ గా క్యాట్‌వాక్ చేసింది. చాలా రోజుల తర్వాత కనిపించిన జెనీలియాను ఇంటర్య్వూ చేయాలని మీడియా వారు మూగారు. అందులో ఒకరు కాస్త ముందడగు వేసి ఇంటర్వూ అడిగాడు. దాంతో ఆమె ఒక్కసారిగా కోపం తెచ్చుసుకుంది. ఇంటర్య్వూ అడగడమే పెద్ద తప్పులాగ జర్నలిస్ట్‌ను ఎడాపెడా దులిపేసింది. ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న ఇతర జర్నిలిస్ట్‌లు జెనీలియా ఆవేశం చూసి షాక్ చేసారు.దాంతో వారంతా ఎదురు తిరిగారు. లక్షలు ఖర్చు చేసి నిర్వహిస్తున్న కార్యక్రమం ఇలా అభాసు పాలవటం మోనేజ్ మెంట్ ని కంగారుపెట్టించింది.
పరిస్థితిని గమనించిన నిర్వాహకులు వివాదం ముదిరితే తమకే నష్టం అని గ్రహించి, వెనువెంటనే రంగంలోకి దిగి జెనీలియాతో చర్చించారు. చివరకు ఆమెచేత జర్నలిస్టులకు సారీ చెప్పించడంతో కథ సుఖాంతమైంది. ఇంతకీ జెనీలియా ఇలా జర్నలిస్టులంటేనే కోపంతో మండిపడటానకి కారణమేమిటా అని అంతా తలలు పట్టుకుని కూర్చున్నారు. ప్రస్తుతం జెనీలియా ..రాణా సరసన నా ఇష్టం చిత్రంలో చేస్తోంది. ప్రకాష్ తోలేటి ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సింహా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











