జెనీలియా, శివ రాజ్ కుమార్‌లు హీరోహీరోయిన్లుగా చేసిన ఓ చిత్రం ఇప్పుడు తెలుగు వారిన్ని పలకరించబోతోంది.కన్నడంలో విజయవంతమైన సత్య ఇన్ లవ్ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. చౌడేశ్వరి ప్రసన్నమూవీస్ పతాకంపై రాఘవలోకి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి తెలుగుకి ఆర్. శంకర్ నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంపై నిర్మాత శంకర్ మాట్లాడుతూ చిత్ర ఆడియోను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని చెప్పారు. జెనీలియా ఈ చిత్రంలో చక్కగా నటించిందని, ఆమె నటన చిత్రానికి హైలైట్ కానుందని అన్నారు. యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్‌లతో ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.