జెనీలియా పూజలు ఎవరికోసం???
జెనీలియా లవర్ గాళ్ గానే మీడియా గుర్తిస్తోంది కానీ మనకు తెలియని మరో ఆసక్తికర అంశం ఆమె డైరీలో ఉంది మరి. భరత్ లవ్వాయనం ఒకటే కాదు...ఆమె దక్షిణ భారతంలో ఉన్న ప్రముఖ దేవాలయాలను సమయం దొరికితే చాలు దర్శిస్తుందట. పెద్దయెత్తున పూజలు చేస్తుందట. పేరుగాంచిన చర్చిలన్నిటిని సందర్శిస్తుందట కూడా.
జెనీలియా పూజల గొడవ తెలియగానే ఇంతకు దేనికోసం పూజలు అంతగా పూజలు చేస్తోందని ఆరా తీస్తున్నారు. ఆమె సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె తన కెరీర్ వృద్ధికోసమే ఆమె పూజలని తెలుస్తోంది. తెలుగులో ఇపుడిపుడే తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డ జెనీలియా ఆ ప్రయత్నం సఫలీకృతం కావాలని భావిస్తోందట.


Click it and Unblock the Notifications











