Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అదే నా ఫస్ట్ ఎక్సపీరియన్స్...జెనీలియా
నా ఏడేళ్ళ తెలుగు సినీ కెరీర్ లో ఎప్పుడూ పూర్తి స్క్రిప్ట్ తో వచ్చిన దర్శకులని,నిర్మాతలనీ చూడలేదు. మొదటి సారిగా బౌండెడ్ స్క్రిప్టుని చూసి చేసిన సినిమా కథ. ఇలాంటి అనుభవం ఇంతకుమున్నెన్నడూ జరగలేదు. చాలా హ్యాపీగా ఉంది అంటూ జెనీలియా తన రాబోయో చిత్రం కథ గురించి మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలాగే ఈ చిత్రంలో నేను చేసిన చైత్ర లాంటి అమ్మాయినీ నేను ఎప్పుడూ కలవలేదు అంటూ మెచ్చుకుంటోంది. అంతేగాక ఈ చిత్రం నిర్మాత గుణ్ణం గంగరాజు..ప్రొపిషినలిజం,కమిట్ మెంట్ చాలా ఆశ్చర్యపరిచిందంటోంది. డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ఆమెకు మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో జెనీలియా తాను పోషించబోయే పాత్ర గురించి చెబుతూ...నాది 'చైత్ర' అనే స్కూల్ టీచర్ పాత్ర. స్కూల్ టీచర్ అనగానే కేవలం పిల్లలకు పాఠాలు చెప్పే పంతులమ్మనే కాదు. ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. అన్ని రకాల ఎమోషన్స్ పలికించే అవకాశం కూడా నాకు ఈ పాత్ర ద్వారా దక్కినందుకు ఆనందంగా వుంది. చాలెంజింగ్ గా ఫీలయ్యి చేసిన ఈ పాత్ర రాబోయే 15 సంవత్సరాల వరకు నేను చాలా గర్వంగా చెప్పుకునే విధంగా వుంటుంది అంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఆమె ఓ రొమాంటిక్ ధ్రిల్లర్ గా వర్ణిస్తోంది.
అలాగే కథ చిత్రం కథ...జార్ఖండ్ లో మొదలయ్యే ఈ కథ అరకుతో సంబంధం ఏర్పరచుకుంటుంది.మిగతా పాత్రల్లో ప్రకాష్‌రాజ్, షఫీ, రఘుబాబు తదితరులు నటించారు. సంగీతం: ఎస్.కె.బాలచంద్రన్, కళ: రవీందర్, కెమెరా: ఆండ్రూ, మాటలు: గుణ్ణం గంగరాజు.