జెనీలియా థ్రిల్లింగ్ ‘కథ’
అర్జుణ్ కొత్త హీరో పరిచయం చేస్తూ, జెనీలియా నటిస్తున్న చిత్రం 'కథ". ఈ సినిమాకు గుణ్ణం గంగరాజు నిర్మాత. శ్రీనివాస్ రాగా దర్శకుడు, నిర్మాత మాట్లాడుతూ చాలా విరామం తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది, హైదరాబాద్ పరిసరాల్లో పాటను తెరకెక్కిస్తున్నామన్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో పాటల్ని, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. జెనీలియా ఉపాధ్యాయినిగా కనిపిస్తుంది ప్రేమకథ జోడించిన థ్రిల్లర్ ఇది. కీలక సన్నివేశాలు అరకులో చిత్రించాం. అవి చిత్రానికి హైలైల్ అవుతాయి మా కథకు సరిపోతుందని కథ అనే పేరు పెట్టుకున్నామని చెప్పారు. గుణ్ణం గంగరాజు సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుంది. ఆయన అందించే ప్రతి చిత్రం కూడా ఓ ప్రత్యేకత కలిగి ఉండటమే అందుకు కారణం. గంగరాజు తీసిన లిటిల్ రాస్కేల్స్, ఐతే, అనుకొకుండా ఒక రోజు.....చిత్రాలు అందుకు నిదర్శనం. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, షపి, రఘుబాబు ఇతర ముఖ్య పాత్రదారులు. ఈ సినిమాకి ఎస్ కె బాలచంద్రన్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











