'కొరికి చూడండి' అంటూ ఫాంటా యాడ్ లో అదరకొడ్తున్న జెనీలియా ఇకనుంచి క్యాడ్ బరీస్ ని సైతం ప్రమోట్ చేయనుంది. టేకిట్ లైట్ లీ అంటూ జెనీలియా ఈ యాడ్ లో కుర్రాళ్ళకు కిక్కిస్తూ కనపడి అమ్మకాలు పెంచుతుంది. ఇక ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ క్యాడ్ బరీస్ ఇండియా డైరక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సంజయ్ పురోహిత్ మీడియాతో మాట్లాడారు. ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జెనీలియా..యూత్ తో కనెక్ట్ అవటం మేం గమనించాం..ఆమె మా అంబాసిడర్ గా పవర్ ఫుల్ గా యూత్ ఫుల్ నెస్ ని ప్రమోట్ చేస్తుందని భావిస్తున్నాం. ఈ యాడ్ త్వరలోనే టీవీ, రేడియో, ఇంటర్ నెట్ లల్లో మనలని పలకరించనుంది. ఈ కొత్త యాడ్ మీ పరిస్ధితులు సరిగా లేనప్పుడు క్యాడ్ బరీస్ తిని, ఉత్సాహం తెచ్చుకోండని అంటున్నారు.
Story first published: Thursday, March 12, 2009, 17:03 [IST]