For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ హోస్ట్ గా జెనీలియా

    By Staff
    |

    జెనీలియా త్వరలో బిగ్ స్విచ్ అనే టీవీ పోగ్రామ్ కి హోస్ట్ గా చేయనుంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ..మోడలింగ్‌ అయినా సినిమాలైనా టీవీ షోస్‌ అయినా...ఏదైనా సమర్థవంతంగా చేస్తా అంటున్నారు.ఈ షో ఒప్పుకోవడానికి ఒక కారణం అభిమానులు అంటున్నారు జెనీలియా. సినిమాల ద్వారానే కాకుండా టీవి ద్వారా కూడా అభిమానులను అలరించాలన్నది ఆమె ఉద్దేశం అయ్యుంటుంది. ప్రస్తుతం ఓ రేంజ్‌లో ఉన్న సినిమా తారలు టీవీ షోలు చేస్తున్నారు. అందుకుగాను పారితోషికం కూడా భారీఎత్తున ఉంటోంది కాబట్టే మీరు కూడా ఈ షోని అంగీకరించారా? అని జెనీలియాని అడిగితే - "ఇప్పటివరకు నా జీవితంలో ఏది జరిగినా దానంతట అది జరిగిందే తప్ప ప్రత్యేకంగా నేను ప్లాన్‌ చేయలేదు అంటోంది.

    ఈ షోని ఆరంభించనున్న నిర్మాణ సంస్థతో నేను రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ సంస్థతో నాకు మంచి అనుబంధం ఉంది. నా క్రమశిక్షణ, కృషి చూసి, ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించమని కోరారు. ఆ ప్రతిపాదన నచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలకన్నా టీవి ద్వారానే ఎక్కువమంది ప్రేక్షకులను చేరుకోగలుగుతున్నాం. నేను దక్షిణాది రంగంలోకి అడుగుపెట్టేటప్పుడు బాలీవుడ్‌ కాదనుకున్న తారలే అక్కడికి వెళతారని, ప్రత్యేకమైన స్థానం ఉండదని చాలామంది నాతో అన్నారు. కానీ, అది తప్పని నిరూపించాను. దక్షిణాదిన నాకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోగలిగాను. అలాగే, బాలీవుడ్‌లో కూడా నిరూపించుకున్నాను. టీవీ షో ద్వారా కూడా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటానన్న నమ్మకం ఉంది' అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌, ఫరాఖాన్‌ చేస్తున్న షోస్‌కి మంచి స్పందన లభిస్తోంది.

    త్వరలో వారి జాబితాలో చేరతారన్నమాట అన్నప్పుడు - "వాళ్లెక్కడ... నేనెక్కడ? వయసు, అనుభవం..ఈ రెండింటిలోనూ వాళ్లిద్దరూ ఎంతో గొప్ప. వాళ్లతో పోల్చవద్దు. కానీ నా షోకి ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో అంతా చేస్తాను' అంటున్నారు జెనీలియా. పక్కింటి అమ్మాయి అనిపించుకునే పాత్రల్నే ఎందుకు చేస్తున్నారు? అనే ప్రశ్నని జెనీలియా ముందుంచినప్పుడు - "ఆ తరహా పాత్రలు చేస్తే తప్పేముంది? అన్ని పాత్రలూ ఒకే రకంగా లేవు కదా. అయినా అప్పుడే కెరీర్‌ పూర్తయినట్లు కంగారు పడటమెందుకు. తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ...ఈ నాలుగు భాషల్లో కలిపి దాదాపు పాతిక సినిమాలకుపైనే చేసినా ఇప్పుడిప్పుడే కెరీర్‌ ఆరంభించినట్లుగా ఉంది. కాబట్టి ప్రయోగాలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. అన్ని రకాల పాత్రలూ చేస్తాను' అన్నారు జెనీలియా. ప్రస్తుతం జెనీలియా తెలుగులో 'కథ', హిందీలో 'హుక్‌ యా క్రూక్‌', 'చాన్స్‌ పే డాన్స్‌' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X