తెలుగు డైరక్టర్ పై జెనీలియా పొగడ్తల వర్షం
జెనీలియా తాను చేస్తున్న నా ఇష్టం చిత్రం దర్శకుడు ప్రకాష్ తోలేటి పై ఆమె పొగడ్తల వర్షం కురిపిస్తూ రీసెంట్ గా ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ..నా ఇష్టం ద్వారా ప్రకాష్ అనే ట్యాలెంటెడ్ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అతను చాలా డెడికేటెడ్,ట్యాలెంటెడ్..అతను సినిమా అధ్బుతంగా వస్తోంది. అతని సినిమాలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాను అంది. ఇలా ట్వీట్ చేయటం ద్వారా ఈ చిత్రం కొద్ది మంది దృష్టినైనా గ్యారెంటీగా ఆకర్షిస్తుందని ఆమె భావించి ఈ ట్వీట్ చేసిందంటున్నారు. ఇక సుకుమార్ అశోసియేట్ అయిన ప్రకాష్ తోలేటి ఈ చిత్రాన్ని ఓ అద్బుతం జరగాలి అన్నట్లుగా చెక్కుతున్నాడని,గ్యారెంటీగా ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మరో ఆర్యలా సంచలనం క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో దగ్గుపాటి రానా హీరోగా చేస్తున్నాడు. సింహా నిర్మాత నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నాడు.
నా ఇష్టం లో జెనీలియా కృష్ణ వేణిగా కనిపించి మురిపించనుంది. ప్రకాష్ తోలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. నిర్మాత పరుచూరి కిరీటి మాట్లాడుతూ ..నవతరం కుర్రాడి ప్రేమ, జీవితం చుట్టూ అల్లుకొన్న కథ ఇది. తన గురించి మాత్రమే ఆలోచించే ఆ యువకుడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. దాని వెనక కారణాలేమిటనే విషయాన్ని ఆసక్తికరంగా చెబుతున్నారు దర్శకుడు. వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మలేషియాలో త్వరలోనే ఓ పాటని తెరకెక్కిస్తామని అన్నారు.. యూనైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చక్రి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారిలో బ్రహ్మానందం, నాజర్, సుబ్బరాజు, ఆహుతి ప్రసాద్, అలి, ఉత్తేజ్ ప్రగతి తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











