జెనీలియా 'ఉరుమి' కధేంటి?
జెనీలియా ప్రధాన పాత్రలో చేసిన 'ఉరుమి'చిత్రం మళయాళం నుంచి తెలుగులో డబ్బింగై అదే టైటిల్ తో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఇంతకీ ఈ చిత్రం కథ ఏమిటంటే...''పదహారో శతాబ్దానికి చెందిన కథ ఇది. అప్పట్లో మన దేశానికి వచ్చిన వాస్కో-డ-గామా గురించి మనకు తెలిసింది కొంచెమే. మన దేశ సంపద కోసం అతను ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ కుటుంబానికి అతను తీరని అన్యాయం చేస్తాడు. ఆ పగను వాళ్లు తిరిగి ఎలా తీర్చుకొన్నారనే కథతో సాగే చిత్రమిది. కేరళలో ప్రసిద్ధిగాంచిన ఓ కత్తి పేరు ఉరుమి. కథలో ఆ ఆయుధానిది కీలక పాత్ర.
ఇక ఈ చిత్రంలో జెనీలియా తో పాటు టబు, విద్యాబాలన్,నిత్యమీనన్ చేస్తున్నారు. అలాగే ప్రభుదేవా, ఆర్య, పృథ్వీరాజ్ కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో రూపొంది మంచి విజయంసాధించింది. హైదరాబాద్‌లో 'ఉరుమి' లోగోను దర్శకులు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ప్రచార చిత్రాల్ని బెల్లంకొండ సురేష్ విడుదల చేశారు. నిర్మాత శోభారాణి మాట్లాడుతూ అందుకే అదే పేరును ఉంచామ''న్నారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు. మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: దీపక్‌దేవ్.


Click it and Unblock the Notifications











