వర్జిన్ కోసమే జెనీలియా బెంగుళూరులో...
జెనిలియా తాజాగా వర్జన్ మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. అందుకోసం బెంగుళూరులో ఆమె ఓ ప్రత్యేక మైన ఫోటో షూట్ కి హాజరైంది. రణబీర్ కపూర్ కూడా ఈ ఫోటో షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జెనీలియా తన బ్లాగ్ లో చాలా తానా ఫోటో షూట్ ని చాలా ఎంజాయ్ చేసనట్లు రాసుకొచ్చింది. రణబీర్ తో పనిచేయటం చాలా ఫన్ తో కూడుకున్న వ్యవహారం అంది.ప్రస్తుతం జెనీలియా.. దగ్గుపాటి రాణా కాంబినేషన్ లో నా ఇష్టం చిత్రం చేస్తోంది. ఈ చిత్రం రాత్రింబవళ్లూ షూటింగ్ జరుపుకుంటోంది.దాదాపు రాత్రి రెండు గంటలు వరకూ కూడా షూటింగ్ జరిగాయి కంటిన్యూగా. దానికి కారణం జెనీలియా, రాణా ఇద్దరూ బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే. ఈ చిత్రం త్వరగా ముగించి వారు తమ తర్వాత చిత్రంలోకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.
ఆ మధ్యన మలేషియాలో నలభై రోజులు షూటింగ్ చేసుకొచ్చిన ఈ చిత్రం నిజానికి అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కాకపోవటం కూడా ఓ కారణం అంటున్నారు. ఇక ఈ చిత్రం ఇద్దరు వేర్వేలు ఐడియాలజీలు ఉన్న వ్యక్తుల మధ్యన జరిగే లవ్ స్టోరీ అని చెప్తున్నారు. సుకుమార్ శిష్యుడైన దర్శకుడు తోలేటి ప్రకాష్ తొలి చిత్రం ఇది. ఈ చిత్రం ఆర్య రేంజిలో వర్కవుట్ అవుతుందని నిర్మాత సైతం తన సన్నిహితులతో చెప్తున్నారని తెలుస్తోంది. జెనిలియా రీసెంట్'ఫోర్స్"చిత్రం భాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఘర్షణగా గా వెంకటేష్ తో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో జాన్ అబ్రహమ్, జెనిలియా కాంబినేషన్ లో రీమేక్ చేసారు.


Click it and Unblock the Notifications











