'ఆరెంజ్' దెబ్బకి తెలుగుకి జెనీలియా గుడ్ బై !?
రామ్ చరణ్ 'ఆరెంజ్' చిత్రంలో చేసి వివాదాలు పాలైన జెనీలియా కొంతకాలం పాటు తెలుగు పరిశ్రమకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది. అందుకే ఆమె 'ఆరెంజ్' తర్వాత ఒక్క తెలుగు చిత్రం కూడా ఒప్పుకోలేదు. అయితే ఆమెకు 'ఆరెంజ్' తర్వాత నిజంగా ఆఫర్స్ రాకే బ్రేక్ తీసుకుంటోంది కానీ వేరే కారణమేమీ లేదని కొందరంటున్నారు. ప్రస్తుతం తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె దృష్టి ప్రధానంగా బాలీవుడ్ మీదే ఉందనేది నిజం. ఇక త్వరలో విడుదల కానున్న 'బొమ్మరిల్లు' రీమేక్ 'ఇట్స్ మై లైఫ్', 'హుక్ యా క్రూక్' చిత్రాల మీదే ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ రెండు హిట్టై ఆమెకు హిందిలో పూర్తి బిజీ చేస్తాయని భావిస్తోంది. అయితే తెలుగులో మాత్రం చేయనని తానేమీ నిర్ణయం తీసుకోలేదంటోంది..ఈ విషయమై మాట్లాడుతూ...నేనేమీ అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. అయితే భవిష్యంత్ లో ఏం జరుగుతుందో చూడాలి అంది.


Click it and Unblock the Notifications











