ప్రతిరోజూ టచ్‌లో ఉండకపోయినా.. తీపి గుర్తులు ఎప్పటికీ గుర్తుంటాయి.. రామ్‌పై జెనీలియా పోస్ట్

ఓ సినిమా ప్రయాణంలో ఎంతో మంది మిత్రులు ఏర్పడతారు. జీవితాంతం మంచి స్నేహితులుగా ఉంటారు. హీరో హీరోయిన్లు, నటీనటుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇలాగే రెడీ మూవీ షూటింగ్ సమయంలోనూ ఆ యూనిట్ మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ముఖ్యంగా హీరో రామ్ , హీరోయిన్ జెనీలియా మధ్య రిలేషన్ షిప్ ఏర్పడింది.

Recommended Video

Happy Birthday Ram : Genelia Emotional Post About Ram Pothineni

అయితే అనంతరం బాలీవుడ్ వెళ్లిన జెనీలియా.. టాలీవుడ్‌లో అంతగా కనిపించలేదు. రితేష్ దేశ్‌ముఖ్‌తో వివాహం అనంతరం మరింత దూరమైంది. తాజాగా రెడీ చిత్ర విశేషాలు, రామ్‌తో తనకున్న అనుబంధాన్ని వివిరించింది. రామ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. నాటి విషయాలను గుర్తు చేసుకుంది.

రామ్ బర్త్‌డే వైరల్..

రామ్ బర్త్‌డే వైరల్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ బర్త్ డే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన కామన్ డీపీ కూడా తెగ వైరల్ అయింది.డీపీ సూపర్ ఉందంటూ స్పందించారు.

మరో మాస్ బీట్..

రామ్ బర్త్ డే సందర్భంగా RED చిత్రం నుంచి మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. నేటి ఉదయం పది గంటలకు విడుదల చేసిన డించక్ పాటలో మణి శర్మ బీట్, రామ్ స్టెప్స్, హెబ్బా పటేల్ అందాలు హైలెట్‌గా నిలిచాయి. ఇక ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

అవి ఎప్పటికీ గుర్తుంటాయి..

అవి ఎప్పటికీ గుర్తుంటాయి..

రామ్ పుట్టినరోజు సందర్భంగా జెనీలియా స్పందిస్తూ... ‘డియర్ రామ్.. ఈ స్టిల్ రెడీ సినిమాలోనిది.. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే..మనం ఇంకా కొన్ని ఫోటోలు దిగాలి..హెహెహె.. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు నవ్వులే కాకుండా ఎంతో మంచి వ్యక్తులను కలిశాము..ఎంతో అనుభవం ఉన్నవారిని కలిశాము.. కానీ అవన్నీ అప్పుడే. మనం టచ్‌లో లేము.. కానీ నాటి సంగతులు, తీపి గుర్తులు అన్ని గుర్తున్నాయి.

జీవితం అలా..

జీవితం అలా..

జీవితం అలా ముందుకు సాగుతోంది.. అయినా ఓ మంచి ఫ్రెండ్‌కు నువ్వో ఉదాహరణ.. మనం ప్రతీ రోజు టచ్‌లో ఉండాల్సిన పనే లేదు.. నువ్ ఏం చేస్తున్నా.. మనం ఎక్కడ ఆగామో మళ్లీ అక్కడి నుంచి ప్రారంభం చేయొచ్చు.. నాడు నాకు అందించిన ప్రేమకు ధన్యవాదాలు' అంటూ రామ్ కు విషెస్ చెబుతూ... ‘రెడీ' నాటి విషయాలను గుర్తు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X