వివాహ తేదీ కన్ఫర్మ్ చేసిన జెనీలియా
ఫిబ్రవరి 3న జెనీలియా పెళ్లికూతురు కాబోతోంది. ఆ రోజున రితేష్‌ని వివాహం చేసుకోబోతోంది అంటూ వస్తున్న వార్తలను జెనీలియా కన్ఫర్మ్ చేసింది. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ...''మా లవ్ మ్యాటర్ కి పబ్లిసిటీ అక్కర్లేదు. అందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నాం. మా స్నేహబంధం ఇలాగే జీవితాంతం కొనసాగించాలంటే పెళ్లి ఒక్కటే సరైన మార్గం అనుకొన్నాం. ఆ సమయం కోసమే ఎదురుచూశాం'' అంది జెనీలియా. బాలీవుడ్ హీరో,ఒకప్పటి ముఖ్యమంత్రి కుమారుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో ఆమె స్నేహం.. ఇప్పుడు పెళ్లి పీటల వరకూ కొనసాగింది. ఎప్పుడూ తమ పెళ్లి విషయం ఖండిస్తూ వచ్చే ఆమె మీడియాతో మొదటిసారిగా పెళ్లి విషయాలపై మాట్లాడింది. ఆమె ఈ విషయాలు చెపుతూ.. ''వేడుకకి ఎంతో సమయం లేదు. ఈలోగా షాపింగ్ పూర్తిచేసుకోవాలి. రాబోయే ఆనంద క్షణాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ పెళ్లితో నా జీవితమే కాదు, రితేష్‌తో నా బంధం కూడా పరిపూర్ణమైనట్టే. ముందు కెరీర్‌లో నెగ్గుకురావాలి, ఆ తరవాతే పెళ్లి అనుకొన్నాం. అందుకే ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అందుకే పెళ్లి చేసుకొంటున్నాం. మా ఇద్దరి జీవితాల్లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది'' అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె తెలుగులో ప్రస్తుతం రానా సరసన నా ఇష్టం చిత్రం చేస్తోంది. ప్రకాష్ తోలేటి దర్సకత్వంలో రూపొందే ఆ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. త్వరలో పెళ్ళి కూతురు కానున్న ఆమెకు ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











