For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    జెంట్స్,సెక్స్&ట్రూత్: మియాకు పోటీగా మేల్ పాలకోవా?.. ఏంటీ కొత్త జీఎస్‌టీ?

    |
    జెంట్స్,సెక్స్&ట్రూత్.. మియాకు పోటీగా మేల్ పాలకోవా ?

    రాంగోపాల్ వర్మ పుణ్యమాని ఇండియన్ సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. చాలామందికి ఇది చెత్తగానూ అనిపించవచ్చు. తొంభైల్లో ఆయన తెరకెక్కించిన కథలు ఎంతమందిని ఆశ్చర్యానికి గురిచేశాయో.. ఇప్పుడు కూడా అంతే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కాకపోతే.. కథల్ని పక్కనపెట్టి 'బోల్డ్‌నెస్' పైనే ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారాయన. ఇందుకోసం ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడాయన 'జీఎస్‌టీ'ని స్ఫూర్తిగా తీసుకుని, 'జీఎస్‌టీ'తోనే కౌంటర్ ఇవ్వబోతున్నాడు మరో దర్శకుడు.. ఇంతకీ ఏంటీ కొత్త 'జీఎస్‌టీ'..

     జెంట్స్ సెక్స్&ట్రూత్:

    జెంట్స్ సెక్స్&ట్రూత్:

    వర్మ గాడ్ సెక్స్&ట్రూత్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారో లేక.. ఆయనకు కౌంటర్‌గా తీస్తున్నారో తెలియదు గానీ మొత్తానికి 'జెంట్స్,సెక్స్&ట్రూత్'(జీఎస్‌టీ) అనే మరో సినిమా కూడా మొదలైపోయింది. ఇప్పుడీ 'జీఎస్‌టీ'కి సంబంధించిన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

     అచ్చుగుద్దినట్లు..:

    అచ్చుగుద్దినట్లు..:

    రాంగోపాల్ వర్మ 'జీఎస్‌టీ' పోస్టర్‌కు అచ్చుగుద్దినట్లుగా ఉంది ఈ పోస్టర్. మియా మాల్కోవా స్థానంలో ఓ పురుషుడు, రాంగోపాల్ వర్మ స్థానంలో వేరే దర్శకుడు ఉన్నారంతే. మిగతాదంతా సేమ్ టూ సేమ్ అనేలా ఉంది. ఇంతకీ ఈ కొత్త దర్శకుడు ఎవరంటే.. 'సూర్య ఆకొండి'.

     మేల్ పాలకోవా..:

    మేల్ పాలకోవా..:

    రాంగోపాల్ వర్మ 'జీఎస్‌టీ'లో మియా మాల్కోవా నటిస్తే.. సూర్య ఆకొండి 'జీఎస్‌టీ'లో మేల్ పాలకోవా నటిస్తున్నాడు. ఏంటీ 'మేల్ పాలకోవా' అనుకుంటున్నారా?.. ఇది మాత్రం కచ్చితంగా వర్మ 'జీఎస్‌టీ' బ్యూటీకి కౌంటర్ అనే అనుకోవాలేమో!

     ఇది కూడా ఫిలాసఫికల్ మూవీయే:

    ఇది కూడా ఫిలాసఫికల్ మూవీయే:

    వర్మ 'జీఎస్‌టీ' లాగే తమ 'జీఎస్‌టీ' కూడా ఆధ్యాత్మిక ధోరణిలో సాగుతుందని పోస్టర్ తో చెప్పేశారు. ఈ పోస్టర్ చూసినవాళ్లలో చాలామంది 'వర్మ.. ఏంటి మాకీ కర్మ?' అని తలబాదుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు.

     'జీఎస్‌టీ'ల గోల:

    'జీఎస్‌టీ'ల గోల:

    మొత్తానికి వర్మ మొదలుపెట్టిన 'జీఎస్‌టీ' ట్రెండ్ ఇలా కొంత పుంతలు తొక్కుతూ సాగిపోతోంది. పైత్యం అనుకున్నా సరే.. చెత్త అనుకున్నా సరే.. ఇక ఇలాంటి ప్రయోగాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వర్మ ఓ దారి చూపించాడు.. ఇప్పుడా దారిలో 'సూర్య ఆకొండి' లాంటి దర్శకులు నడుస్తున్నారు. మున్ముందు మరెంతమందో!

    English summary
    While Ram Gopal Varma’s Gst talks about God’s, Sex and Truth, this Gst is named as Gents, Sex and Truth and it talks about the philosophical treatise of Male Palakova. This philosophical treatise of Male Palakova is directed by Surya Akondi.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more