ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు జార్జ్ రెడ్డి.. ఆనందంలో చిత్రయూనిట్

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, శత్రువుల మూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుడి జీవిత చరిత్ర ఆధారంగా జార్జ్ రెడ్డి తెరకెక్కింది. నాటి సామాజిక పరిస్థితులపై, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం పాటు పడిన ఉద్యమ నాయకుడిని దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఉస్మానియా క్యాంపస్ రాజకీయాల్లో బలైన వీరుడు కథను నేటి తరానికి పరిచయం చేసేందుకు వచ్చింది జార్జ్ రెడ్డి.

సందీప్ మాధవ్ టైటిల్‌లో రోల్‌లో అద్భుతమైన నటన ప్రదర్శించాడు. తెరపై చూస్తున్నంతసేపు జార్జ్ రెడ్డినే చూస్తున్నామనేంతగా జీవించేశాడు. నాటి కాలాన్నే చూస్తున్నామా? అనేంత అందంగా చూపించాడు కెమెరామెన్. టెక్నికల్‌గా అత్యున్నత స్థానంలో నిలబడిన ఈ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ చిత్రానికి ప్రేక్షకులనుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇప్పుడు ప్రపంచ స్థాయి వేదికపైనా జార్జ్ రెడ్డి సత్తా చాటబోతోన్నాడు.

 George Reddy Is Selected For Lake View International Film Festival

జార్జ్ రెడ్డి 4th లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈమేరకు డిసెంబర్ 22 మరియు 23వ తారీఖుల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. నోయిడా, ఢిల్లీలో ఈ ప్రత్యేక ప్రదర్శనలు జరగనున్నాయి. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న జార్జ్ రెడ్డి చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌కి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానున్నట్లు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X