జార్జిరెడ్డి హీరో నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడో తెలుసా?
ఒక సినిమా హిట్టయితే నటీనటులకు గ్యాప్ లేకుండా అవకాశాలు రావడం చాలా కామన్. ఇక ప్రయోగాత్మక సినిమాలతో జనాలను నిత్యం ఆకట్టుకునే యాక్టర్స్ కి కూడా అవకాశాలు ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి అతికొద్ది మంది నటులలో ఒకరైన సందీప్ మాధవ్ పేరు కూడా టాలీవుడ్ లో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా మారుతోంది. కానీ అతను మాత్రం వచ్చిన ప్రతి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కథకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులను మాత్రమే ఓకే చేస్తున్నాడు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా ఈ నటుడు జనాలను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంటున్నాడు.
జ్యోతిలక్ష్మి అనంతరం విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి అనే రియల్ స్టోరీలో నటించిన విషయం తెలిసిందే. ఇక జార్జిరెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అలజడి క్రియేట్ చేశాడు. యూత్ కి సందీప్ చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ కూడా అలాంటి డిఫరెంట్ సినిమాలతో రావాలని ఆడియెన్స్ ఎదురుచూస్తుండగా సందీప్ మాత్రం ఒక రొమాంటిక్ సినిమాతో ఆడియెన్స్ ని ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమాటోగ్రాఫర్ అరుణ్ కుమార్ సురపనేని మొదటిసారి ప్రొడక్షన్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తూ సందీప్ ని హీరోగా పెట్టి సినిమా నిర్మిస్తున్నాడు. రైటర్ జీవి మధు దర్శకుడిగా ఈ ప్రాజెక్టు ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇక సినిమాలో సందీప్ నెవర్ బోఫోర్ అనే లుక్ లో దర్శనమివ్వబోతున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు. మరి సందీప్ మాధవ్ మొదటిసారి ట్రై చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ అతనికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











