అరుదైన అవకాశం, రామ్ చరణ్ డుమ్మా.... కారణం చెప్పిన ఉపాసన!
Recommended Video

హైదరాబాదులో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదస్సులో రామ్ చరణ్ కూడా పాల్గొన్నాల్సి ఉన్నా.... ఇతర కారణాలతో ఆయన పాల్గొనలేక పోయారట.
తెలుగు సినీ సెలబ్రిటీల్లో కేవలం రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది. అయితే పలు కారణాలతో ఆయన గైర్హాజరు కావడంతో జిఇఎస్‌లో తెలుగు సెలబ్రిటీలెవరూ కనిపించకుండా పోయారు.

రామ్ చరణ్ గైర్హాజరుపై ఉపాసన
ఈ విషయమై ఉపాసన మీడియాతో మాట్లాడుతూ....ఈ సదస్సుకు చరణ్ కూడా హాజరై ప్రసంగించాల్సి ఉంది. కానీ ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన జీఈఎస్‌కు రాలేక పోతున్నారని ఉపాసన తెలిపారు.

వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్న రామ్ చరణ్
రామ్ చరణ్ ఓ వైపు సినీ నటుడిగా రాణిస్తూనే మరో వైపు సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయన పలు వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జీఈఎస్‌కు ఆహ్వానం అందింది. అయితే అంతకంటే ముఖ్యమైన పనులు ఉండటంతో రామ్ చరణ్ గైర్హాజరైనట్లు సమాచారం.

భార్యను చూసి మురిసిపోయిన చరణ్
అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ హోదాలో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సమ్మిట్‌లో తన భార్య ఉపాసన పాల్గొనడం, ఇవాంకతో కలిసి కనిపించడంతో రామ్ చరణ్ మురిసి పోయారు. టీవీలో ఆమె ప్రసంగాన్ని రికార్డ్ చేసి ఆమెకు పంపించారట.
ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఉపాసన
మై స్వీటెస్ట్ మామయ్య, మిస్టర్ సి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో నా ప్రసంగాన్ని వీడియో తీసి పంపారు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న వారికి థాంక్స్ అంటూ ఉపాసన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


Click it and Unblock the Notifications











