అఖిల్, పూజా హెగ్డేలను కలిసే అవకాశం.. ఎలా అంటే..?
అక్కినేని అఖిల్, పూజా హెగ్డేలు జంటగా నటిస్తోన్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. సక్సెస్ రుచి చూసి చాలాకాలమైన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న అఖిల్ కలిసి చేస్తోన్న చిత్రమిది. అయితే ఈ మూవీపై ఇద్దరూ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.
మొదటి నుంచి ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకు ప్రతీ అప్‌డేట్‌లోనూ ఓ కొత్తదనం ఉండేలా, కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి పాటల వరకు అన్నింట్లో జాగ్రత్తగా ప్లాన్ చేసి జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి మనసా మనసా అనే పాట విడుదలైంది. ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాటపై టిక్ టాక్ వీడియోలు చేసి పంపిన వారికి అఖిల్, పూజా హెగ్డేలను కలిసి అవకాశం కల్పిస్తామని ప్రమోషన్ కార్యక్రమం చేపట్టింది.


Click it and Unblock the Notifications











