రాజమౌళి, ప్రభాస్ చిత్రం: నూతన నటీనటులకు ఆహ్వానం
రాజమౌళి మాటల్లోనే... "ప్రభాస్ హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో నెంబరాఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ క్యారెక్టర్స్ లో కొత్త నటీనటులను పెడితే సినిమాకు ఓ కొత్త అందం వస్తుందని మేమందరం ఫీలవుతున్నాం. నటులు, నటీమణులు ఇద్దరూ కావాలి. ఇరవై సంవత్సరకాల నుండి అరవై సంవత్సరాల కొత్త నటీనటులుకు ఆహ్వానం..."
మీ ఫోటోలు, వీడియోస్ మరియు వివరాలు మెయిల్ చెయ్యాల్సిన మెయిల్ ఐడీ.. [email protected]
ఈ చిత్రం గురించి నిర్మాత దేవినేని ప్రసాద్ మాట్లాడుతూ... "ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












