రాజ్‌కపూర్ 'ఆవారా' రీమేక్
ముంబై : రాజ్‌కపూర్ గొప్ప సినిమాలలో మొదటిగా గుర్తు వచ్చే చిత్రాలల్లో 'ఆవారా' ఒకటి. ఈ చిత్రంలోని 'ఆవారా హూ', 'ఏక్ దో తీన్' లాంటి గీతాలు నేటికీ సంగీతప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు 'ఆవారా'ని రీమేక్ చేసే ఆలోచన చేస్తోంది కపూర్ కుటుంబం. రిషి కపూర్ మాట్లాడుతూ ''మా ఆర్.కె.ఫిలిమ్స్ సంస్థ ద్వారానే పునర్నిర్మించాలనుకొంటున్నాం. 1951లో వచ్చిందా చిత్రం. అందులో నా తండ్రి రాజ్‌కపూర్, తాత పృథ్వీరాజ్ కపూర్‌లు నటించారు. ఈసారి నేను, మా అబ్బాయి రణ్‌బీర్ కపూర్ నటించాలనుకొంటున్నాము'' అన్నారు.
ఇక ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన ప్రియాంక చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'బర్ఫీ'. అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఇఫా) సాంకేతిక విభాగంలో ఇచ్చే పురస్కారాల్లో తొమ్మిదింటిని 'బర్ఫీ' కైవశం చేసుకొంది.
ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ సాంగ్ రికార్డింగ్, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనింగ్, ఉత్తమ మేకప్ విభాగాల్లో అవార్డులు దక్కించుకొంది. జులై 4 నుంచి 6 మధ్య మకావులో ఇఫా పురస్కార వేడుకలను నిర్వహిస్తారు.


Click it and Unblock the Notifications











