చూస్తూంటే పెద్ద హిట్ కొట్టేటట్లు ఉన్నాడు (ఫొటోలు)
హైదరాబాద్ :ఎన్.టి.ఆర్, సమంత జంటగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించిన 'రభస' ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంభందించిన ఫొటోలు విడుదల చేసారు.
సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీకి సెన్సార్ నుండి 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. ఓవరాల్ గా ఈ సినిమాలో 7 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి అందువలనే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఇది యూత్‌ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్ కొత్తగా కనిపిస్తాడు. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఈ చిత్రం ఉంటుంది.
అలాగే
స్లైడ్ షోలో...మిగతా విశేషాలు

రన్ టైం
ఈ చిత్ర టీం రభస మూవీ ఫైనల్ రన్ టైం ని లాక్ చేసింది. మొత్తం రన్ టైం 150 నిమిషాలు(2 గంటల 30 నిమిషాలు).

రిస్క్ తీసుకుని చేసాడు
ఎన్.టి.ఆర్ ఎంతో రిస్క్ తీసుకొని చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ రభస కి హైలైట్ అవుతాయని అంటున్నారు.

ఆడియో హిట్
ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఆడియో పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ పాడిన ‘రాకాశి రాకాశి' పాట హైలెట్‌గా నిలిచింది. త్వరలోనే ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు.

బ్యానర్
‘ఆది' లాంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత బెల్లంకొండ సురేష్ బ్యానర్‌లో ఎన్.టి.ఆర్‌తో చేస్తున్న రెండో చిత్రమిది.

కామెడీ కేక
మొదటి నుంచీ చెప్తున్నట్లు గానే సెకండాఫ్ లో బ్రహ్మానందం - ఎన్.టి.ఆర్ మధ్య వచ్చే కామెడీ ట్రాక్ కూడా ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు.

అన్ని వర్గాల కోసం...
ఎన్.టి.ఆర్ నుండి తన అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, డాన్సులు, కామెడీతో పాటు కుటుంబ విలువలు, సెంటిమెంట్ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ఉండనున్నాయి.

పక్కా మాస్ లుక్
యూత్‌ఫుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. పక్కా మాస్ లుక్‌తో ఎన్టీఆర్ కనిపిస్తారు. యూత్‌ఫుల్ స్టైల్‌లో ఉంటారు. ఫ్యామిలీని ఆకట్టుకుంటారు. ఈ మూడు జోనర్లను టార్గెట్ చేసి అందరూ ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు.

భారీ విడుదల
ప్రస్తుతం థియోటర్స్ ఎన్ని అనేది ఫైనల్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ చిత్రాల్లో ఈ చిత్రం భారీగా విడుదల అవుతున్న చిత్రంగా చెప్తున్నారు.

తెరమీద
ఎన్టీఆర్,సమంత తో పాటు ప్రణీత, బ్రహ్మానందం, అలీ, నాజర్, జయసుధ, బ్రహ్మాజీ, జె.పి, నాగినీడు, షాయాజీషిండే తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక
ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.్థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











