»   »  మాజీ ప్రియుడి బెడ్రూం సీక్రెట్స్ వెల్లడించిన దీపిక

మాజీ ప్రియుడి బెడ్రూం సీక్రెట్స్ వెల్లడించిన దీపిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ ప్రస్తుతం మాజీ లవర్స్. ఇద్దరూ కలిసి ప్రస్తుతం ‘తమాషా' అనే సినిమాలో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకోన్.... రణబీర్ కు సంబంధించిన బెడ్రూం సీక్రెట్లు బయట పెట్టింది.

డిఎన్ఏ ఇంటర్వ్యూలో... దీపిక్ పదుకెన్, రణబీర్ కపూర్ కలిసి పాల్గొన్నారు. ఇందులో వారికి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. బ్రీఫ్స్ లేదా బాక్సర్స్... వీటిలో మీరు వేటిని ప్రిఫర్ చేస్తారు అంటూ ప్రశ్న ఎదురైంది. దీనికి రణబీర్ కపూర్ సమాధానం ఇస్తూ ‘బ్రీఫ్స్' అని చెప్పారు. రణబీర్ నోటి నుండి ఆ మాట రాగానే దీపిక స్పందిస్తూ.. అతను అబద్దం చెబుతున్నాడు. అను బాక్సర్లు వాడతాడు అని వ్యాఖ్యానించింది. రణబీర్ వేసుకునే అండర్ గార్మెంట్స్ గురించి, అతని పడకగది సీక్రెట్స్ గురించి దీపికకు బాగా తెలుసు, ఎందుకంటే ఇద్దరూ గతంలో పీకల్లోతు ప్రమలో ఉన్నారు. మరి ఈ విషయం ప్రస్తుతం రణబీర్ తో సహజీనవం చేస్తున్న కత్రినాకు తెలుసో? తెలియదో?

ఇదే ఇంటర్వ్యూలో రణబీర్ ఇతర విషయాలపై స్పందిస్తూ...‘రియాల్టీ షోలలో తన సినిమా ప్రమోషన్ చేయడాన్ని ఇష్టపడను. సినిమా ప్రేక్షకులకు నచ్చితే ఆటోమేటిక్ మంచి స్పందన వస్తుంది. ఆడుతుంది. రియాల్టీ షోలలో ఉండి ప్రచారం చేసినంత మాత్రాన వారు థియేటర్లకు వెళ్లి టికెట్స్ కొనరు. రియాల్టీ షోలలో వారు మనల్ని కేవలం స్టార్లుగానే చూస్తారు. ఇలాంటి ప్రమోషన్స్ వారిని టికెట్లు కొనేలా చేయలేవు అన్నారు.

తమాషా

తమాషా


2015 సంవత్సరంలో బాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్న ‘తమాషా' ఒకటి.

దర్శకత్వం

దర్శకత్వం


తమాషా చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు.

రొమాంటిక్ డ్రామా

రొమాంటిక్ డ్రామా


రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంగీతం

సంగీతం


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

నటీనటులు

నటీనటులు


రణబీర్, దీపికలతో పాటు జావేద్ షేక్, నిఖిల్ భగత్, ఫరాజ్ సెర్వావియా, పూనమ్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.

English summary
Ranbir Kapoor and Deepika Padukone are all set to woo their fans with their upcoming film Tamasha. Recently, Deepika revealed some bedroom secrets of Ranbir in an interview.
Please Wait while comments are loading...