చిరంజీవి క్యారెక్టర్ అలాంటిది.. ఓ సారి ఆయన ఇంటికెళ్తే.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్

కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎందరో కమెడియన్లు పాపులారిటీ సంపాదించారు. టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ఈ నవ్వుల షో. జడ్జ్ స్థానంలో రోజా, నాగబాబు.. యాంకర్ ప్లేస్‌లో అనసూయ, స్కిట్స్ వేసే కంటిస్టెంట్స్ ఇలా ఎవరికి వారు ఈ షోలో ప్రత్యేకమే. అందుకే గత కొన్నేళ్లుగా బుల్లితెరపై నవ్వుల హరివిల్లులు కురిపిస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది జబర్దస్త్ షో. ఇలాంటి జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన గెటప్ శ్రీను తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. వివరాల్లోకి పోతే..

జబర్దస్త్ హీరోలు.. గెటప్ శ్రీను కామెంట్స్

జబర్దస్త్ హీరోలు.. గెటప్ శ్రీను కామెంట్స్

జబర్దస్త్ కమెడియన్స్‌కి ఉన్న పాపులారిటీ గుర్తించి పలు యూ ట్యూబ్ ఛానెల్స్ వారు వీళ్ళతో ప్రత్యేక ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. శాంతి స్వరూప్, వినోద్, రైజింగ్ రాజు, గెటప్ శ్రీను.. ఇలా ఒకరి తర్వాత ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర సంగతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిపై గెటప్ శ్రీను చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

జబర్దస్త్ నుంచి వెండితెర బాట

జబర్దస్త్ నుంచి వెండితెర బాట

జబర్దస్త్ వేదికపై జబర్దస్తీ కామెడీ చేసిన ఎందరో కమెడియన్స్ వెండితెరపై కాలుమోపి సక్సెస్ అయ్యారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను లాంటి వారు సినిమాల్లోనూ జోష్ కొనసాగిస్తున్నారు. ఒకరకంగా జబర్దస్త్ వేదిక అనేది వెండితెరకు కమెడియన్ల చిరునామా చూపించే కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు.

ఎందరో ప్రముఖులు.. అందులో చిరంజీవి కూడా

ఎందరో ప్రముఖులు.. అందులో చిరంజీవి కూడా

నవ్వులు పంచుతూ ఓ గంట పాటు అన్నీ మరచిపోయేలా చేసే ఈ జబర్దస్త్ కామెడీ షో అంటే పలువురు సినీ ప్రముఖులు కూడా బాగా ఇష్టపడుతుంటారు. ఇదే విషయాన్ని గెటప్ శ్రీను తన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా తమ షోను చాలా ఇష్టపడతారని చెప్పాడు గెటప్ శ్రీను.

చిరంజీవి ఇంటికి వెళ్తే..

చిరంజీవి ఇంటికి వెళ్తే..

మెగా బ్రదర్ నాగబాబు చొరవతో టీం అంతా కలిసి ఓ సారి చిరంజీవి ఇంటికి వెళ్లామని చెప్పిన గెటప్ శ్రీను.. చిరంజీవి వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ షో గురించి, అందులోని పార్టిసిపెంట్స్ గురించి చిరంజీవి చెబుతుంటే అంతా పొంగిపోయామని అన్నాడు గెటప్ శ్రీను. ఒక్కో స్కిట్ గుర్తు పెట్టుకుని మరీ చిరంజీవి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేసిందని చెప్పాడు.

కొరటాల శివ సినిమాలో కమెడియన్

కొరటాల శివ సినిమాలో కమెడియన్

ఇటీవలే సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి.. తన 152 వ ప్రాజెక్టును కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో తనకు కారెక్టర్ ఉందని చిరంజీవి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు గెటప్ శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X