గజనీ సూర్య 'డూప్లికేట్'
సూర్య,కాజల్ కాంబినేషన్ లో మాట్రాన్ టైటిల్ తో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో 'డూప్లికేట్' అనే పేరును ఖరారు చేశారు. కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వేసవవిలో భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కాజల్ హీరోయిన్ కావటం కూడా ఈ చిత్రానికి ప్లస్. సూర్య చిత్రాలు తెలుగులో గతంలో ఇక్కడ మంచి విజయం సాధించటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజీలలో ఉంది.


Click it and Unblock the Notifications











